తమ్ముడు... చంద్రశేఖరరావు తమ్ముడూ... అని నోరారా గీ అక్క నగరం
నడిబొడ్డున అందునా ఆటలాడే మైదానంల స్టేజీ ఎక్కి పిలిచింది. కానీ సీఎం
కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ అక్క తెలంగాణ భూములు ఆక్రమించుకుందని,
కోట్ల రూపాయలు వెనకేసుకుందని అందరూ ఆరోపిస్తున్నారు. గతంలో
శేరిలింగంపల్లి తహసిల్దార్ విచారణ చేస్తే కొంత నిజం బయటపడింది.
మరి గీ అక్క తమ్ముడు ఏకంగా సీఎం అయ్యారు. మరి గామె రుణం తీర్చుకోవాలి
కదా. అందరూ ఆరోపిస్తున్నట్లు అసలు ఆమె నిజంగా ఆక్రమించిందా?. లేదా?.
తేల్చండి ఒక అధికారుల బృందాన్ని అక్కడికి పంపండి. నిజంగా ఆమె ఆక్రమిస్తే
వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. ఏమైనా రికవరీలు ఉంటే ఉన్న
ఆస్తులు కూడా జఫ్తు చేయండి. మొత్తంగా ఆమె తప్పు చేస్తే శిక్షించండి.
ఆతర్వాత గిన్ని ఆక్రమించింది, గింత తిన్నది అంత సర్కారు తీసుకుంది. ఇక
ఆమె వద్ద ఏం లేదు... అని క్లీన్‌చీట్ ఇయ్యండి. అంతేగానీ... తెలంగాణ
సర్కారు ఏర్పడి ఇరవై రోజులు దాటుతున్నా... కేసీఆర్ తమ్ముడు గీ అక్కను
పట్టించుకోకపోవడం ఏం బాగా లేదు.
కేసీఆర్ గారు తొందరగా పట్టించు కోవాలే
ReplyDelete