ఎందుకు వేసుకోవడం లేదు అంటే... ఆ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..
అదే టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు...
ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి స్థల ప్రాధాన్యం ఇవ్వాలని నీతులు చెప్పేది....
అయితే జేపీ విషయానికి వస్తే ఆ సూత్రాన్ని పక్కకు పెట్టిందనుకోండి.... అది వేరే విషయం....
ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు...
ఇక టీడీపీకి 15 మంది మాత్రమే ఉన్నారు...
అయినా కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రాంత ఈనాడు ఎడిషన్‌లో టీడీపీ వార్తలు వస్తున్నాయి..
విచిత్రం ఏంటంటే.. ఈ వార్తలన్నీ కూడా సీమాంధ్ర టీడీపీ వార్తలు కావడం గమనార్హం...
కనీసం ఇక్కడ ఉన్న 15 మంది టీడీపీ నేతల వార్తలు వచ్చినా ఈ పత్రిక టీడీపీ పక్ష పాతి అని అనుకునే వాన్ని...
కానీ మొత్తం ఆంధ్రా నేతల ఫొటోలు, చంద్రబాబు బొమ్మలతో తెలంగాణ ఈనాడు ఎడిషన్ కంపుకొడుతోంది...
విచిత్రం ఏంటంటే లోకేశ్ వార్తను ఆంధ్రాలో చిన్నగా వేసి తెలంగాణలో పెద్దగా వేయడం....
ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి స్థల ప్రాధాన్యం దక్కుతుందా?
లేక వాళ్ల ప్రాంతాలను, కులాల బట్టి దక్కుతుందా? అన్నది పాఠకులే ఆలోచించుకోవాలి....
ఒకవేళ ఆంధ్రా ప్రభుత్వం వార్తలు తెలంగాణలో వేస్తున్నప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం వార్తలను
ఆంధ్రాలో అంతే మొతాదులో వాడాలి కదా.. మరి ఎందుకు వేయడం లేదు?
అంతా మాయ... తెలంగాణ జనాన్ని నిత్యం మోసం చేయాలన్న ఆలోచనే... తెలంగాణ పాఠకుడు మేలుకునే వరకూ ఈ ఆగడాలు ఇలాగే కొనసాగుతాయి....
No comments:
Post a Comment