1

1

Wednesday 25 June 2014

చూశారా... ఈ న‌క్కజిత్తులు!.

చూశారా... ఈ న‌క్కజిత్తులు!. తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతున్న పీపీఏ అంశంలో ఈనాడు మ‌డ‌త‌పేచీతో క‌థ‌నం ఇచ్చింది. స్పష్టంగా ఏపీ ప్రభుత్వం పున‌ర్విభ‌జ‌న చ‌ట్టానికి తూట్లు పొడుస్తూ పీపీఏలు ర‌ద్దు చేసినా.. ఆ విష‌యాన్ని ఎక్కడా ప్రస్తావించ‌లేదు. ఇదేదో వివాదం అంటూ గ‌వ‌ర్నర్ పేరిట ఏపీ ప్రభుత్వ త‌ప్పిదాన్ని ఏమాత్రం ఎత్తిచూప‌కుండా రాసింది. కానీ కృష్ణాజ‌లాల విష‌యంలో మాత్రం తెలంగాణ ఇంజినీర్లు ఒప్పుకున్నా తెలంగాణ ప్రభుత్వం కావాల‌ని ప‌ది టీఎంసీల నీటి విడుద‌ల‌కు ఒప్పుకోవ‌డంలేద‌ని చెప్పే ప్రయ‌త్నం చేసింది. అందుకే నామ‌మాత్రంగా ఈ అంశంపై వివాదం నెల‌కొంద‌ని రాసి... నాటి నిర్ణయం మేర‌కే... అంటూ త‌న పైత్యాన్ని వండి వార్చింది. ఇది నిజ‌మే అయితే పీపీఏ విష‌యంలోనూ నాటి పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం మేర‌కే అని ఒక పేరాతో అస‌లు వాస్తవాలు రాసి, దానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పీపీఏల‌ను ర‌ద్దు చేసింద‌ని రాస్తే జ‌ర్నలిజం విలువ‌ల‌కు వ‌న్నె వ‌చ్చేది. కానీ ఏపీ విష‌యంలో ఒక‌లా.. తెలంగాణ విష‌యంలో మ‌రోలా త‌న పైత్యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ముమ్మాటికీ ఇది మీ పేప‌ర్ కాద‌ని తెలంగాణ ప్రజ‌ల‌కు మ‌రోలా స్పష్టం చేసింది.

అందుకే అప్రమ‌త్తత అవస‌రం...
కృష్ణా డెల్టాకు ప‌ది టీఎంసీల విడుద‌ల విష‌యంలో మ‌న ఇంజినీర్లు ముందుచూపుతో వ్యవ‌హ‌రించ‌లేదా?. అనే అనుమానం క‌లుగుతుంది. అస‌లు సాగ‌ర్‌లో ఉన్నవే 13-14 టీఎంసీలు (డెడ్‌స్టోరేజీ మిన‌హా) అలాంట‌ప్పుడు డెల్టాకు ల‌భ్యత ఉన్న నీటిలో 77 శాతం ఎలా ఇస్తారు?. అందుకు మ‌న ఇంజినీర్లు ఎలా అంగీక‌రించారు. ప‌ద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, ప్రతి అంశంపై నిశిత‌మైన అవ‌గాహ‌న ఉన్నందున కేసీఆర్ వెంట‌నే ఆ ప్రతిపాద‌న‌కు ప‌చ్చజెండా ఊప‌కుండా ఆప‌గ‌లిగారు. అదే ఇత‌ర నేత‌లు (వారి త‌ప్పిదం కాక‌పోవ‌చ్చుగానీ... అధికారులు చెప్పిందే త‌డ‌వుగా పాల‌కులు త‌ల ఊప‌డం స‌హ‌జం)ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేది?. వెంట‌నే ప‌ది టీఎంసీల నీళ్లు ఇస్తే క‌నీసం హైద‌రాబాద్ తాగునీటికి కూడా ఇబ్బంది త‌లెత్తేది. ఈలోగా డెల్టా ప్రాంతం వారు నారుమ‌ళ్లు పోసుకొని, సాగ‌ర్‌లో ఉన్న నీళ్లను ఎత్తులో ఉన్న తెలంగాణ‌కు ఎలాగూ వినియోగించ‌లేం... క‌నీసం దిగువ‌న ఉన్న రైతులు ఇప్పటికే పంట చేతికొచ్చే ద‌శ‌లో ఉన్నందున వ‌ద‌లాలంటూ ఎక్కడ‌లేని మాన‌వ‌తా
దృక్ఫథాన్ని ఒక‌ల‌బోసేవారు. ఈ ప‌రిస్థితిని మ‌న ఇంజినీర్లు ముందుగానే గుర్తిస్తే అస‌లు ఆ ప్రతిపాద‌న ప్రభుత్వం దాకా కూడా వ‌చ్చ‌ది కాదు. అంతేకాదు ఇటీవల‌ ‌జ‌రిగిన సాగునీటి పారుద‌ల స‌మీక్షలో కేసీఆర్ కృష్ణాన‌దిపై ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రస్తావించిన‌పుడు అస‌లు నీళ్లెక్కడున్నాయ్ అని మ‌న ఇంజినీర్లు అన్నార‌ని, అంటే ఇంకా మ‌న‌వారు స‌మైక్య రాష్ట్రంలో ఉన్నట్లుగానే భావిస్తున్నట్లు ఒక సీనియ‌ర్ ఇంజినీర్ చెప్పారు. ఇంజినీర్ల అభిప్రాయాన్ని తోసిపుచ్చిన కేసీఆర్‌... సాగ‌ర్‌లో నీళ్లుండ‌గాలేనిది పైన క‌ట్టే ప్రాజెక్టుల్లో ఎలా ఉండ‌వు?. అని వ్యాఖ్యానించార‌ట‌. అంటే... రాష్ట్రం ఏర్పడిందేగానీ ఇంకా మ‌న‌లో మా తెలంగాణ రాష్ట్రం అన్న భావ‌న వేళ్లూనుకుపోలేదు. 60 ఏళ్ల అణ‌చివేత క‌దా... మ‌రికొన్ని రోజుల్లోనే మ‌న ఆలోచ‌లనూ ఆ సంకెళ్లు వీడ‌తాయ‌ని ఆశిద్దాం. ఏదేమైనా సాగునీటి పారుద‌ల విష‌యంలో మ‌న ఇంజినీర్లు చాలా అప్రమ‌త్తంగా, దూర‌దృష్టితో అడుగులు వేయాల‌ని తెలంగాణ స‌మాజం కోరుతుంది. ఎందుకంటే వాళ్లు ఏమాత్రం మాన‌వ‌తా దృక్ఫథాన్ని చూపినా అంతిమంగా అది మ‌న తెలంగాణ‌కు న‌ష్టం చేసేదిగా ఉంటుంద‌నేది వారికి తెలియ‌నిది కాదుగానీ ఎమ‌రుపాటు వ‌ద్దనేది సూచ‌న‌.

గ్రావిటీ త్వరిత‌గ‌తిన సాక్షాత్కరించాల్సిందే!
ఈరోజు ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌లో చూడండి. తెలంగాణ ప్రభుత్వం కాద‌న్నా ఏపీ స‌ర్కారు కుడి కాలువ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమైంద‌ని మ‌న‌కు హెచ్చరిక‌లు జారీ చేశారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప‌ది టీఎంసీలు విడుద‌ల చేయాలంటూ రెండు రాష్ట్రముల అధికారుల ఆదేశించింద‌ట‌. అస‌లు చంద్రబాబు, ఆయ‌న తాబేదారు ప‌త్రిక‌ల‌కు తెలంగాణ రాష్ట్రం విడిపోయింద‌ని, దానికి కేసీఆర్ సీఎంగా ఉన్నార‌నే ధ్యాస లేకుండా పోయింది. లేకుంటే ఏపీ సీఎం తెలంగాణ అధికారుల‌ను ఆదేశించ‌డానికి ఎవ‌రు?. వాళ్లకు లేకున్నా, ఈ ప‌త్రిక‌ల‌క‌యినా సోయి ఉండాలి క‌దా. ఈ విష‌యం పక్కన‌పెడితే ఎప్పటికైనా సాగ‌ర్ మ‌న‌కు ముప్పే. ఎలాగూ కుడికాల్వ వాళ్ల ప‌రిధిలో ఉన్నందున మ‌నం ఎంత నియంత్రించినా డ్యాం డెడ్‌స్టోరేజీ కంటే త‌క్కువలో ఏర్పాటు చేసిన కుడికాల్వ ద్వారా వాళ్లు నీళ్లు తీసుకుపోయే వెసులుబాటు ఉంది. అందుకే మ‌నం ఎంత వీలైంత అంత త్వర‌లో ఎగువ‌న ప్రాజెక్టులు నిర్మిస్తేనే దిగువ అహంకారానికి చెక్ పెట్టిన‌ట్లవుతుంది. అందుకే అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన జూరాల‌-పాకాల ఎంత త్వర‌గా సాకారమైతే అంత త్వర‌గా పూర్తి చేయాలి. అప్పుడే మ‌న‌కు స్వీయ సాగునీటి పారుద‌ల వ్య వ‌స్థ ఏర్పడుతుంది. అంతేకాదు ఇన్నాళ్లూ వ‌ల‌స పాల‌కులు తెలంగాణ‌కు ఎత్తిపోత‌ల త‌ప్ప గ్రావిటీ వీలు కాద‌నే హేయ‌మైన ప్రచారానికి, అబ‌ద్దానికి చెంప పెట్టులా గ్రావిటీపై కృష్ణమ్మ మ‌న బీళ్లలో గ‌ల‌గ‌లా పారుతుంది. జై తెలంగాణ జైజై తెలంగాణ‌


No comments:

Post a Comment