1

1

Wednesday, 25 June 2014

ఈ జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులు కొంద‌రున్నారే.. వీళ్లు మ‌హా ముదుర్లండోయ్‌....!!!


చంద్ర‌బాబునాయుడు పాల‌న‌లో ఆయ‌న‌కు ఊడిగం చేశారు... ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌చ్చాక‌.. ఆయ‌న చేసిన ప‌నుల‌ను స‌మ‌ర్థించారు.. సాక్షి ఛానెల్ చ‌ర్చ‌ల్లో మ‌హాద్భుతంగా ఉప‌న్యాసాలు ఇచ్చారు.. ఇక జ‌ర్న‌లిస్టు స్థ‌లాల కోసం బినామీల‌ను కొంద‌రిని జాబితాలో చేర్చిన ఘ‌నులు వీళ్లే..
ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌ఠాత్తుగా చ‌నిపోయాక ఏం చేయాలో తెలియ‌క కొన్నాళ్లు రోశ‌య్య పంచ‌న చేరారు.. త‌ర్వాత జ‌గ‌న్ ప‌క్క‌కు చేరి స‌మ‌ర్థించారు... తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్‌ను వీళ్లే అంద‌రి క‌న్నా ముందు క‌లిశారు...

తెలంగాణ ఉద్య‌మ కాలంలో మీడియా రెచ్చిపోయిన‌ప్పుడు నోళ్లు మూసుకున్నారు... మొన్న‌టికి మొన్న టీవీ9 ఛానెల్‌లో జుగుప్సాక‌రమైన‌
రీతిలో ప్రొగ్రామ్ వ‌చ్చిన‌ప్పుడు ఏ బారులో మందు కొడుతూ చూశారో నాకు తెలియ‌దు.. జ‌నం గ‌గ్గోలు పెట్టి... కేసీఆర్ స‌హా శాస‌న‌స‌భ టీవీ9 చేష్ట‌ల‌ను ఖండించిన‌ప్పుడు కూడా నోరు తెర‌వ‌ని పెద్ద‌మ‌నుషులు వీళ్లు... ఎంఎస్‌వోలు ధైర్యంగా ఆ ఛానెళ్ల ప్ర‌సారాల‌ను ఆపేస్తే మాత్రం వీళ్లు మేల్కొన్నారు.. మీడియా భావ ప్ర‌క‌ట‌న హ‌క్కులు వీరికి గుర్తొచ్చాయి...

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉస్మానియాలో విద్యార్థుల‌ను చిత‌క బాదుతున్న‌ప్పుడు... పోలీసుల మార్గ‌దర్శకాలు ఉన్నాయి అని చెప్పి ఆ దృశ్యాల‌ను చూప‌ని మీడియా సంస్థ‌ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు...? మీడియా స్వేచ్ఛ‌కు కళ్లెం వేసిన పోలీసుల‌పై ఎందుకు ఉద్య‌మించ‌లేదు?

ఉస్మానియాలో విద్యార్థుల‌పై ద‌మ‌న‌కాండ‌ను నిర‌సిస్తూ హైకోర్టులో కేసు వేసిన అప్ప‌టి ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి రెహ్మాన్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించిన‌ప్పుడు ఎక్క‌డికి పోయింది మీ పెద్ద‌రికం...... అప్పుడు పాత్రికేయుల హ‌క్కులు గుర్తుకు రాలేదా?
తెలంగాణ ఉద్యోగిని అన్యాయంగా తొల‌గించార‌న్న విష‌యాన్ని ఎందుకు విస్మ‌రించారు...?

నేను మీకిచ్చేది ఒక్క‌టే స‌ల‌హా....

జ‌రుగుతున్న వాట‌న్నింటినీ ప‌ట్టించుకోకుండా... య‌థావిధిగా టీవీ చూస్తూ మందుకొట్టి పండుకోండి...! అంత‌క‌న్నా ఎక్కువ‌గా మీరు చేయ‌లేరు.. ప‌త్రికా స్వేచ్చ‌, మీడియా స్వేచ్చ‌ల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే ఉంటాయి....

No comments:

Post a Comment