2012, 2013లో రైల్వే ఛార్జీలను యూపీఏ ప్రభుత్వం పెంచినప్పుడు బీజేపీ వాళ్లు యూపీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు... రైలు ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ అప్పటి గుజరాత్, ప్రస్తుత ప్రధాని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ కు ఘాటైన లేఖ రాశారు... రైలు ఛార్జీల పెంపు వల్ల నిత్యావసరాల ధరలపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు...
మరి ఇప్పుడు ఎన్డీయే రైలు ఛార్జీలు పెంచింది.. ఇక విమర్శల వర్షం కురిపించాల్సింది విపక్షాలు... డైలాగులు అవే ఉంటాయి.. యథావిధిగా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు... వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి.. పెట్రోల్ ధరలు పెరుగుతాయి.. కూరగాయల ధరలూ పెరుగుతాయి... మనం చూస్తూ ఉండాల్సిందే.. పాలకులు ఎవరైనా ఏళ్ల తరబడి జరుగుతున్నది తంతు ఇదే... మరో ఐదేళ్ల వరకూ ఇలాగే చల్తా హే....
No comments:
Post a Comment