మెట్రో మార్గంపై కేసీఆర్ జోక్యం చేసుకోకుంటే... ఆంధ్రజ్యోతి వార్త ఇలా ఉండేది..!
బేగమ్ బజారు తదితర ప్రాంతాల్లో మెట్రో రైల్‌ను అండర్ గ్రౌండ్ మార్గంలో తీసుకెళ్లాలని కేసీఆర్ విపక్షంలో ఉన్నప్పటి నుంచీ కోరుతున్నాడు.. ఒక వేళ తమ మాట వినకుండా నిర్మాణాలు చేపడితే బాంబులతో కూల్చేస్తామన్నంత హెచ్చరికలు కూడా ఇచ్చాడు..
ఈ విషయంపై చాలాసార్లు బేగంబజారు వ్యాపారులు చేసిన బంద్‌కు మద్దతు ప్రకటించాడు.. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు..
మెట్రో రైల్ మార్గాన్ని యథాతథంగా అనుమతిస్తే ఎల్ అండ్ టీ వద్ద భారీగా డబ్బు తీసుకున్నాడు.. అందుకే మెట్రో మార్గంపై నోరు మెదపడం లేదు అంటూ వార్తలను ప్రసారం చేసేది...!
కేసీఆర్ జోక్యం చేసుకోవడంతో ఇలా రాయాల్సి వచ్చింది...!
ష్చ్... ఆంధ్రజ్యోతి ఆశలు ఫలించలేదు... మెట్రో మార్గం విషయంలో కేసీఆర్ ముక్కుసూటిగా ఉన్నాడు.. చరిత్రాత్మక ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ పనులు చేయాలని ఆదేశించడంతో ఇప్పుడు మెట్రోకు ఎర్రజెండా అంటూ కథనాలు రాస్తోంది... హైదరాబాద్ అభివృద్ధికి విరోధకుడు కేసీఆర్ అన్నట్లు అర్థం వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది.... తెలంగాణ వాదులారా.. పారాహుషార్...
అయితే చరిత్రాత్మక ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ మెట్రో మార్గాన్ని వేయాలన్న పార్టీల జాబితాలో బీజేపీ, టీడీపీ కూడా ఉన్నాయి.. ఆ రెండు పార్టీలు
చాలాసార్లు బంద్ కు కూడా పిలుపునిచ్చాయి.. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి...
No comments:
Post a Comment