1

1

Tuesday 1 July 2014

బైలెల్లిపోతున్న ఈనాడు

2004లో వైఎస్ అధికారంలోకి రావ‌డంతో నైరాశ్యంలో్కి వెళ్లిన ఈనాడు ప‌దేళ్ల పాటు అహంకారాన్ని త‌న‌లో అణ‌చుకుంది. స్వ‌త‌హాగా ఉద్యోగ‌స్తులంటే బానిస‌లుగా భావించే యాజ‌మాన్యం వైఎస్ స‌ర్కారు విసిరిన స‌వాళ్ల‌తో ఆర్థికంగా అయోమ‌యంలోకి వెళ్లి ఉద్యోగుల జోలికి వెళ్ల‌కుండా ఉంది. కానీ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. రామోజీ రిమోట్ చంద్ర‌బాబు ఏపీలో అధికారంలోకి వ‌చ్చాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇంకేముంది... ఈనాడు త‌న‌లో అణ‌చుకున్న అహంకారాన్ని ఇప్పుడు ఒక్క‌సారిగా బ‌య‌టికి తీసింది. కొన్నిరోజులుగా మిడిల్ మేనేజ్‌మెంట్ ద్వారా త‌న వికృత‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. బ‌దిలీల‌తో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై ఉక్కుపాదాన్ని మోపిన యాజ‌మాన్యం తాజాగా ఉద్యోగుల‌పై మ‌రో పంజా విసిరింది. మూసాపేట‌, సోమాజిగూడ కార్యాల‌యాల‌ను ఖాళీ చేయించి... అన్ని డెస్క్‌ల‌ను రామోజీ ఫిల్మ్‌సిటీకి త‌ర‌లించేందుకు రంగం సిద్ధం చేశారు. కొన్ని గంట‌ల ముందే అధికారికంగా దీనిని ప్ర‌క‌టించారు. జులై24 మొద‌లై ఆగ‌స్టు మొద‌టి వ‌ర‌కు ఈ త‌ర‌లింపు ప్ర‌క్రియ పూర్తి కావాల‌ని షెడ్యూలు కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. న‌గ‌రానికి ప‌దుల కిలోమీట‌ర్ల దూరంలో అందునా జాతీయ ర‌హ‌దారిపై ఉన్న ఫిల్మ్ సిటీకి ఎలా వెళ్లాల‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఈ త‌ర‌లింపుతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతుంటే యాజ‌మాన్యం మాత్రం కాసులు వెన‌కేసుకుంటున్నందుకు సంతోష‌ప‌డుతుంది. ఇప్పుడు ఇంటి అద్దె అల‌వెన్స్ కింద 20 శాతం ఇస్తుంటే రామో్జీ ఫిల్మ్ సిటీకి వెళ్ల‌డం ద్వారా ఉద్యోగ‌స్తుల‌కు 10 శాతం మాత్ర‌మే అల‌వెన్స్ ఇవ్వాల్సి వ‌స్తుంది. అంటే యాజ‌మాన్యానికి 10 శాతం మిగులుతుంది. అంతేకాదు ఎలాగూ ఆరెఫ్‌సీ బ‌స్సులు ఉన్నందున అందులో ఉద్యోగుల‌ను త‌ర‌లించి ర‌వాణా అల‌వెన్స్ కూడా కోత విధించేందుకు నిర్ణ‌యించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. న‌గ‌రంలో ఉన్న భ‌వ‌నాల‌ను అద్దెకు ఇచ్చి ల‌క్ష‌లు సంపాదించాల‌నేది వ్యూహం.
చూశారా... చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే రామో్జీ సామాన్యుల‌పై ఎలా పంజా విసురుతాడో?! దేవుడి ద‌య వ‌ల్ల ఇక్క‌డ కేసీఆర్ రావ‌డం వ‌ల్ల ఆ కొంత నియంత్ర‌ణ ఉందిగానీ లేకుంటే జ‌ర్న‌లిస్టుల‌ను దిన‌స‌రి కూలీలుగా మార్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేదేమో!

No comments:

Post a Comment