తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 50 రోజులు దాటినా దేశంలో ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల ప్రజలకు కొత్త రాష్ట్రం ముచ్చట్లు తెలియడం లేదు.. ఎందుకంటే మీడియా మంచి విషయాల కన్నా సంచలనాలు, వివాదాస్పదాలకే ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే.. కానీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడంపై మన బీజేపీ నేత లక్ష్మణ్ గారు చేసిన విమర్శల వల్ల గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పేరు దేశమంతా(నాకు తెలిసి ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనూ చర్చనీయాంశం అయి ఉండొచ్చు) మారుమోగింది...
మన రాష్ట్రానికి ప్రచారం చేయడానికి, మనకున్న పాపులారిటీని మరింత పెంచడానికి, మన గుర్తింపును ద్విగుణీకృతం చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లను పెట్టుకుంటారు.. సానియా మిర్జాను ఎంపిక చేయడమే తరువాయి పాపం లక్ష్మణ్ గారు పార్టీ అధినాయకత్వం వైఖరిని కూడా తెలుసుకోకుండా చాలా విమర్శలు చేశారు.. చివరకు ఆయన సొంత పార్టీతో సహా కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా.. ఈశాన్యభారతం నుంచి గుజరాత్ వరకు అన్ని రాష్ట్రాల నేతలు ముక్తకంఠంతో లక్ష్మణ్ గారి వ్యాఖ్యలను ఖండించారు.. ఏదైతేనేం ఆయన రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేసినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం పేరు.. మన రాష్ట్ర అంబాసిడర్ ఎవరన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది.. రేపు కౌన్ బనేగా కరోడ్‌పతీలో అమితాబ్ బచ్చన్ కూడా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అన్న ప్రశ్నను సంధించినా ఆశ్చర్యపోనవసరం లేదు..!!!

No comments:
Post a Comment