1

1

Friday 11 July 2014

మ‌రోసారి మ‌న‌నం...

మొన్న‌...
ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్లు ఇచ్చేట‌ప్పుడు చంద్ర‌బాబు ఇంటికే ప‌రిమితం అవుతాడు. సీమాంధ్ర మీడియాలో ఆయ‌న మేధోమ‌థ‌నం చేస్తున్న‌ట్లుగా వ‌స్తుంది. కానీ కేసీఆర్ త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో జాబితాపై కుస్తీ ప‌డితే... పార్టీలో వ్య‌తిరేక‌త త‌ట్టుకోలేక పార్టీ కార్యాల‌యం రాకుండా అక్క‌డ దాక్కున్న‌ట్లు వ‌స్తుంది. ఇది ఎన్నో ఏళ్లుగా సీమాంధ్ర మీడియా అతి చాక‌చ‌క్యంగా చేసిన కుట్ర‌. అందుకే 2009 న‌వంబ‌రు ముందు వ‌ర‌కు తెలంగాణ జ‌నంలో కేసీఆర్ ప‌ట్ల సీమాంధ్ర మీడియా పెంచిపోషించిన వ్య‌తిరేక‌త భావం ఉండేది. ఆత‌ర్వాత అది ప‌టాపంచ‌లైంద‌నుకోండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే... చంద్ర‌బాబు, డ్రామోజీ ఒక అబ‌ద్ధాన్ని ఎంత చాక‌చ‌క్యంగా జ‌నాల్లోకి ఎక్కిస్తార‌నేందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.
నిన్న‌...
ఇదే కోవ‌లోకి మ‌రోటి వ‌చ్చింది. వాస్త‌వంగా రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం... పారిశ్రామిక రంగంలో కేంద్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు వ‌ర్తిస్తాయో స‌రిగ్గా తెలంగాణ‌లోనూ అదేరీతిన అమ‌ల‌వుతాయి. ఇది అక్ష‌ర స‌త్యం. కానీ సీమాంధ్ర మీడియా కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశం ఉన్న‌ట్లుగా పారిశ్రామిక‌వేత్త‌లు, జ‌నాల్లో భ్ర‌మ‌లు క‌ల్పిస్తుంది. ఇది నిజం కాద‌నే మ‌న గోడుకు స‌రైన ప్ర‌చారం ల‌భించ‌డం లేదు.
తాజాగా...
రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఉమ్మ‌డి రాజ‌ధానిలో ప‌లు అంశాల‌కు సంబంధించి గ‌వ‌ర్న‌ర్‌కు కొన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. కానీ సీమాంధ్ర ఆ బాధ్య‌త‌లు అనే ప‌దాన్ని అధికారాలుగా మార్చింది. వాస్త‌వంగా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇదే విష‌యంపై గ‌తంలో అప్ప‌టి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబ‌రంను ఒక మీడియా ప్ర‌శ్నించిన‌పుడు గ‌వ‌ర్న‌ర్‌కు వ‌ర్తించేవి అధికారాలు కావు... కేవ‌లం బాధ్య‌త‌లు అని మాత్ర‌మే స్ప‌ష్టం చేశారు. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌తో పాటు అనేక‌మంది తెలంగాణ మేధావులు, నాయ‌కులు ఈ విష‌యాన్ని చెబుతున్నా... సీమాంధ్ర మీడియా మాత్రం ఇంకా అధికారాలు అనే ప‌దాన్ని వాడుతుంది. ఇదంతా అమాయ‌క తెలంగాణ ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డంతో పాటు సీమాంధ్ర ప్ర‌జ‌ల్లో లేనిపోని ఆశ‌లు రేకెత్తించ‌డానికి చేస్తున్న కుట్ర‌.

అందుకే సీమాంధ్ర మీడియా అస్థిత్వాన్ని దెబ్బ‌తీయాలంటే స‌ర్క్యులేష‌న్‌, ప్ర‌క‌ట‌న‌ల‌పై మ‌నం స్వీయ నిషేధాన్ని విధించుకోవాలి. లేక‌పోతే ఇలాంటి ఎన్నో కుట్ర‌ల‌కు మ‌నం బ‌లి కావాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ప‌త్రిక‌ల‌కు స‌మాచారం విష‌యంలో స‌హాయ నిరాక‌ర‌ణ‌, జ‌నం ప‌త్రిక‌లు వేయించుకోకుండా, ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా ఉండేలా ప్ర‌తినబూనితే త‌ప్ప ఈ విష వృక్షాల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించ‌డం సాధ్యం కాదు. జై తెలంగాణ‌.. జైజై తెలంగాణ‌

No comments:

Post a Comment