ఇటీవల గురుకుల్ ట్రస్టు భూముల్లో కూల్చివేతలు జరగ్గానే సీమాంధ్ర మీడియా తెగ హడావుడి చేసింది. అమాయకులు బలవుతున్నారు... అసలైన వారిని శిక్షించకుండా వదిలేస్తున్నారు... అంటూ లేనిపోని కట్టుకథలు అల్లేందుకు తెగ ఆరాటపడింది. మరి ఇంతవరకు బాగానే ఉంది. కానీ వీటి నల్లి నంగనాచి నాటకాలు రోజుల వ్యవధిలోనే బట్టబయలయ్యాయి. నిజంగా వీరు సమాజ శ్రేయస్సు కోరే వారయితే... నిరుపేద రైతులను ఆదుకోవాల్సిన భూదాన్ః భూములు అన్యాక్రాంతమైనా ఎందుకు పట్టించుకోవడం లేదు?. అమాయక జనం నుంచి కొందరు వేలకు వేలు గుంజి కోట్లు గడించినా వారిని ఎందుకు నిలదీయడం లేదు?. భూదాన్ అక్రమాలకు సూత్రధారి అయిన రాజేందర్‌రెడ్డి సోదరుడే వీటిని బట్టబయలు చేశాడు. ఆధారాలతో సహా అన్ని మీడియా సంస్థలకు వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆయన గతంలో వార్తలో కూడా వరుస కథనాలు ఇప్పించారు. అయితే ఇప్పడు మాత్రం కేవలం ఐ న్యూస్, టెన్ టీవీలు మాత్రమే ఈ అక్రమాలపై కథనాలను ప్రసారం చేశాయి?. మెరుగైన సమాజం కోసం పోరాడే టీవీ-9, దమ్మ్మున్న ఛానెల్ ఏబీఎన్, సామాన్యుడి ఆరో ప్రాణమైన 6టీవీ, ఇలా స్లోగన్లు పెట్టుకున్న ఎన్‌టీవీ, ఈటీవీ (అందునా తెలంగాణ ఈటీవీ)లు ఎక్కడకు పోయాయి?. జగన్ అవినీతిపై లక్షల పేజీలు వేసిన ఈనాడు, డ్రామోజీ భాగోతంపై పేజీలకు పేజీలు నింపిన సాక్షి, నాలుగు గోడల మధ్య జరిగే శృంగారాన్ని సైతం వెతికి పట్టుకొని వండి వార్చే ఆంద్రజ్యోతి ఇలా ఒకటేమిటి!. తెలంగాణ గొంతుకలు అని చెప్పుకునే మీడియా కూడా అసలు ఎందుకు వీటిని ప్రచురించలేదు... ప్రసారం చేయలేదు. అసలు తెలంగాణోడు సెంటు భూమి జాగా కబ్జా చేస్తే ఆ అర్హత నీకెక్కడిది?. అనే రీతిలో హడావుడి చేసే సీమాంధ్ర మీడియా ఈ అక్రమాల్లో ఫక్తు తెలంగాణకు చెందిన వ్యక్తులే బాధ్యలైనప్పటికీ ప్రచురించేందుకు, ప్రసారం చేసేందుకు ఎందుకు ముందుకు రాలేదు?. దీని వెనక ఆంతర్యమేమిటి?. ఏ ప్రాంతం వారైనా అక్రమార్కులు అంతా ఒకటి.. జనమంతా ఒకటి అనే నినాదాన్ని ఏమైనా పాటిస్తున్నారా?. అసలు వారి మౌనానికి కారణమేమిటో ఈ సంస్థలన్నీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముంది.
No comments:
Post a Comment