నిత్య సమీక్షలు... సాఫీగా సాగుతున్న తెలంగాణ సర్కారు పాలన... అక్రమార్కులపై కొనసాగుతున్న కొరడా... ఇలాంటి సమయంలో కేంద్ర సర్కారు నుంచి గవర్నర్ అధికారాలపై తెలంగాణ ప్రభుత్వానికి సర్క్యులర్ వచ్చింది. వాస్తవంగా ఇది పునర్విభజన చట్టంలోని అంశమైనప్పటికీ ఇప్పడే ఇది జారీ కావడం వెనక బహుముఖ వ్యూహాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, డ్రామోజీతో పాటు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు కలిసి మోడీ ద్వారా ఈ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వీరు పలు ప్రయోజనాలు ఆశిస్తున్నారు...
! సాఫీగా సాగుతున్న తెలంగాణ సర్కారు పాలనకు దీని ద్వారా అవరోధం (డిస్డర్బ్) కలిగించడం
! గురుకుల్ భూముల మాదిరిగా తెలంగాణ సర్కారు ఇకముందు సీమాంధ్ర ఆక్రమణలపై దూకుడు ప్రదర్శించకుండా నిలువరించడం
! ఎలాగూ కేసీఆర్ దీనిని వ్యతిరేకిస్తారు కనుక కేంద్ర ప్రభుత్వనాకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచడం
! ముఖ్యంగా...... తలకుమించిన హామీల భారంతో సతమతం అవుతున్న చంద్రబాబు సీమాంధ్ర జనం దృష్టిని పూర్తిగా హైదరాబాద్ వైపునకు మళ్లించడం
! విభజన సమయం వరకు హైదరాబాద్‌పై ఆశలు పెట్టుకున్న సీమాంధ్ర జనం తమకూ ఓ రాజధాని కావాలనే భావనలోకి వచ్చారు. దీంతో వారిని పూర్తిగా దారి మళ్లించి... ఈ అంశం ద్వారా మళ్లీ వారిలో హైదరాబాద్‌పై ఆశలు రేగేలా భావోద్వేగాలను రెచ్చగొట్టడం... తద్వారా చంద్రబాబు వైఫల్యాలను కప్పి పుచ్చడం. ప్రధానంగా రుణ మాఫీలను తప్పించుకోవడం
అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగానే దీనిని ఎదుర్కోవాల్సి ఉంది. తెలంగాణవాదులు దూకుడు ప్రదర్శిస్తే అదే అదును చేసుకొని ఆ సాకు చూపి... సీమాంధ్ర భద్రత పేరిట చంద్రబాబు, డ్రామోజీ కేంద్ర సర్కారు ద్వారా హైదరాబాద్‌ను తమ గుప్పిట పెట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే సంయమనంతో ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ సమస్యను ఎదుర్కోవాలనేది నా భావన.
No comments:
Post a Comment