1

1

Tuesday 29 July 2014

దీని భావ‌మేమి రామోజీగారు...?


తెలంగాణ ఎడిష‌న్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం ఫొటో వేస్తారు..
మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేవ్ ఎడిష‌న్లో తెలంగాణ సీఎం బొమ్మ వేయ‌లేదు ఎందుకు?
వార్త శైలి కూడా పూర్తి భిన్నంగా ఉందెందుకు?



విప్రో ఛైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీ గారు మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు... అయితే తెలంగాణ ఎడిష‌న్లో మొద‌టి పేజీలో కేసీఆర్‌, చంద్ర‌బాబుతో అజిమ్ ప్రేమ్‌జీ భేటీ అయిన వార్త‌ను ఈనాడు పేప‌ర్లో వేశారు.. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ ప‌రిశ్ర‌మ‌లు స్థాపిస్తామ‌ని చెప్పారు.. అయితే తెలంగాణ ఎడిష‌న్లో రెండు రాష్ట్రాల్లో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించ‌డానికి ప్రేమ్ జీ ముందుకొస్తున్న‌ట్లు వార్త‌ను రాశారు...
ఇక ఆంధ్రా ఎడిష‌న్‌కు వెళ్తే పూర్తిగా ఆంధ్రాలో స్థాపించే ప‌రిశ్ర‌మ‌ల వివ‌రాల‌తో మొద‌టి పేజీ వార్త‌ను వ‌డ్డించారు... తెలంగాణ‌లో ఆంధ్రా వార్త‌ను రాసిన‌ప్పుడు.. ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ సీఎంను విప్రో ఛైర్మ‌న్ క‌లిసిన ఫొటోను ఎందుకు మొద‌టి పేజీలో వేయ‌లేదు.. అంటే ప్రేమ్ జీ కేవ‌లం చంద్ర‌బాబునే క‌లిశార‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం మీ ఉద్దేశ‌మా?   అదే స‌మ‌యంలో కేసీఆర్‌ను మాత్ర‌మే కాదు చంద్ర‌బాబును కూడా ప్రేమ్ జీ క‌లిశాడ‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్న ఆత్రుత‌తో ఇదంతా చేశారా?   ప్రతి వార్త వెన‌క‌, ప్ర‌తి ఫొటో వెన‌క ఇంత విషం నింపుకుని రాయ‌డం ఎందుకు?   తెలంగాణ, ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఇంకెన్ని రోజులు వంచించాల‌ని అనుకుంటున్నారు...?


1 comment:

  1. హైదరాబాద్ సీమంధ్ర కి 10 ఇయర్స్ జాయింట్ కాపిటల్ అని తెలుసు కదా? చంద్రబాబు నాయుడు ని అజీం ప్రేమ్జీ ఎక్కడ కలిసాడు? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో జరిగిన విషయం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ కి తెలియచేప్పతమే కదా న్యూస్పేపర్ కర్తవ్యం? పైగా జాయింట్ కాపిటల్. ఇంకా పైగా హైదరాబాద్ లో ౩౦ లక్షల మంది సీమంధ్రులు ఉన్నారు. తెలంగాణా చీఫ్ మినిస్టర్ కనుక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎవరితో అయినా మీటింగ్ పెట్టినట్లు అయితే అక్కడి ఎడిషన్ లో నే రాస్తారు కదా. మీకు ఇష్టం లేకపోతే పేపర్ కొనకండి, చదవకండి. బలవంతం లేదు కదా?

    ReplyDelete