సూశిండ్రా... దెబ్బకు దయ్యం వదులుతుందంటే ఇదే!. నిన్నటిదాకా సోకాల్డ్ మేధావులు, కొమ్మినేనిలాంటి ఏకపక్ష జర్నలిస్టులు, అంతెందుకు ఈనాడు సంస్థలో నెలకు లక్ష జీతం తీసుకున్న వారి నుంచి ట్రెయినీ రిపోర్టర్ల వరకు తమ ఫేసుబుక్‌ల్లో ***హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే... అందుకే దివి నుంచి భువికి దిగినట్లు, సీమాంధ్ర నుంచి నగరానికి వచ్చాం. అంటూ ఒకవైపు చార్మినార్ బొమ్మ, మరోవైపు హైటెక్ సిటీ బొమ్మ పెట్టి శునకానందం పొందారు. మరి గీరోజు వచ్చిన కథనంలో వాళ్ల గోస చూడండి. అందితే జుట్టు... లేకపోతే కాళ్లు అన్నట్లు... సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు, ఫీజులు ఇప్పించేందుకు ఎంతటి వాస్తవానికి వచ్చి కథనాలు రాస్తున్నారో. ఈరోజు ఈనాడులో వండివార్చిన కథనంలో వారి బాధ చూస్తుంటే నవ్వేస్తుంది. ***రెండు తరాల కిందట పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారట**** ఈ విద్యార్థుల మూలాలు అన్నీ సీమాంధ్రలో ఉన్నాయట...**** వారెవ్వా ప్రభుదేవా!. మరి నిన్నటిదాకేమో తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణోళ్లకు చెడ్డీలు వేయడం నేర్పడానికి వచ్చినట్లు ఫోజులు కొట్టిండ్రు. మరి గియ్యాలేమైంది బిడ్డా. ఇంతకీ మూలాలు అంటే ఏందో?. అవి తరాలు మారినా గట్లనే ఉంటయా?. మరి అక్కడ మూలాలు ఉన్నోళ్లకు గిక్కడ ఫీజులెందుకు కట్టాలి?. రాసే ప్రతి అక్షరంలో గిట్ల ఒళ్లు దగ్గర పెట్టుకొని రాస్తే భలే బాగుంటుంది కదా. అయినా... కుక్క తోక వంకర అన్నట్లు మీరు మారతారా??. ఫీజుల గండం గట్టెక్కించి, చంద్రాలుకు సహాయం చేసేందుకు గీ కథలన్నీ పడుతుండ్రు. మాకు తెల్వదా. ఇదేదో 1960-70 దశకంలోని తెలంగాణ కాదు. మీరు కట్టుబట్టలతో వచ్చినమన్నా... బరిబత్తల సీమాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినమన్నా... కరుణించెటోడు ఎవడూ లేడు. ఎందుకంటే
ఇది గాయపడిన తెలంగాణ...
వేలాదిసార్లు కడుపుకోతను అనుభవించిన తెలంగాణ...
ఆరు దశాబ్దాల పాటు తమ సంస్కృతి, సంప్రదాయాలను అవమానించినా వాటిని డొక్కల్ల దాచుకొని సమయం కోసం పడిగాపులు కాసిన తెలంగాణ...
అన్ని రంగాల్లో నిలువునా మోసపోతున్నా భావి తరాలైనా సల్లగుండాలని లాఠీలు, తూటాలకు గుండెను ఎదురొడ్డిన తెలంగాణ... అన్నింటికీ మించి తాను బతికేందుకు పక్కోని శరీరాన్ని సైతం పీక్కుతినేందుకు వెనుకాడని ఈరోజుల్లో ఒక ప్రాంత స్వేచ్ఛా వాయువుల కోసం వందలసార్లు అగ్నిదేవుడికి తనువును అప్పగించిన తెలంగాణ...
అక్షరాలతో, కట్టు కథలతో, మాయ మాటలతో మోసం చెయ్యలేరు. 1956 ఒక్క నిబంధనతోనే వాస్తవాల రాక మీ నోటి నుంచి మొదలైంది. ముందుంది ముసర్ల పండగ. చెట్టుమీదున్న బేతాళుడు దిగి వచ్చి సచ్చినట్లు అన్నీ నిజాలే చెప్తాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
జై తెలంగాణ... జైజై తెలంగాణ
No comments:
Post a Comment