1

1

Thursday, 17 July 2014

వీళ్లు మ‌నుషులేనా?!




తెలుగు... తెలుగు...
నిత్యం ఉషోద‌యంబున అస‌త్య క‌థ‌నాల‌ను చూపించేందుకు ఈనాడు సంధించే ప‌దాస్త్రం ఇది. పైకి తెలుగు వెలుగులు అంటూ... లోప‌ల మాత్రం తాను, త‌న తాబేదారు చంద్ర‌బాబు స్వార్థం కోసం ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు కూడా ఈ ప్ర‌తిక వెనుకాడ‌టం లేదు. చూడండి... ఈరోజు సీమాంధ్ర ఎడిష‌న్‌లో వ‌చ్చిన ఈ వార్త‌ను. అస‌లు ఎప్ప‌డైనా సీమాంధ్ర ఎడిష‌న్‌లో ఈనాడు కేసీఆర్ బొమ్మ వాడిన దాఖ‌లాలు ఉన్నాయా?. అస‌లు ఆ పేరు రాకుండానే ఎడిష‌న్ వ‌చ్చేలా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. కానీ ఈరోజు మాత్రం చంద్ర‌బాబు హామీల అమ‌లుపై నుంచి జ‌నం దృష్టిని మ‌రల్చేందుకు ఈ దుస్సాహ‌సానికి ఒడిగ‌ట్టింది. స‌చివాల‌యంలో కేసీఆర్ గంట‌న్న‌ర‌కు పైగా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తే... అందులో ఎన్నో అంశాలు, వంద‌ల విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టింది. కేవ‌లం ** మీ పిల్ల‌ల ఫీజులు మీరే క‌ట్టుకోండి** అనే హెడ్డింగ్‌తో మొద‌టి పేజీలో ప్ర‌ముఖంగా ఈ వార్త‌ను ఇచ్చింది. కేసీఆర్ హామీల అమ‌లులో ముంద‌డుగు వేశార‌నిగానీ, అస‌లు తెలంగాణ‌లో రైతుల రుణాల మాఫీ, ఇలా అనేక వ‌రాలు కురిపించార‌నే వాస‌న కూడా ఆ ఎడిష‌న్‌లో రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. స‌రే.. కేసీఆర్‌ను అక్క‌డ పొగ‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఇత‌ర అనేక విష‌యాలు ఉన్నాయి క‌దా... వాట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం సీమాంధ్ర విద్యార్థుల ఫీజుల‌ను ఆ ప్ర‌భుత్వ‌మే క‌ట్టుకోవాల‌న్న మాట‌ను సూటిగా అలా కాకుండా.. మీరే క‌ట్టుకోండి!. అని ఓ స‌గ‌టు సీమాంధ్ర వాసిని అన్న‌ట్లుగా, వారిలో కోపాన్ని ర‌గిల్చేలా, లేనిపోని విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు శాయ‌శ‌క్తులూ ఒడ్డుతుంది. జ‌నం కొట్టుకు చ‌స్తే మాకేంది... నేను, నా అక్ర‌మ ఆస్తులు, చంద్ర‌బాబు స‌ల్ల‌గుంటే చాల‌న్న‌ట్లు డ్రామోజీ ఇలాంటి క‌థ‌నాల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావార‌ణాన్ని సృష్టిస్తున్నాడు. కానీ ఈ కుట్ర‌లు చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఏమాత్రం క‌ప్పి పుచ్చ‌లేవ‌ని, మ‌రికొన్ని రోజుల్లో డ్రామోజీ ఎన్ని డ్రామాలు ఆడినా చంద్ర‌బాబును వైఫ‌ల్యాల సుడిగుండం నుంచి గ‌ట్టెక్కించ‌లేడ‌నే విష‌యాన్ని మాత్రం గుర్తించడం లేదు. కాక‌పోతే ఆ స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌క‌న్నా రామోజీ... సామాన్య జ‌నంతో సాగించే ఇలాంటి క్రీడ‌ల‌కు స్వ‌స్తి ప‌లికితే బాగుంటుంది.


No comments:

Post a Comment