1

1

Friday, 11 July 2014

ఏ చీక‌టికో ఈ ప్ర‌స్థానం?!

చంద్రుడు సంపూర్ణంగా ఉంటే అది పౌర్ణ‌మి. అందుకు భిన్నంగా ఉంటే అది అమావాస్య‌. మ‌రి... బొల్లి చంద్రుడు సీమాంధ్ర ఎన్నిక‌ల్లో సంపూర్ణ అధికారం చేప‌ట్టాడు. సీమాంధ్ర‌కు అది పౌర్ణ‌మినో కాదోగానీ... తెలంగాణ‌కు మాత్రం సంపూర్ణ అమావాస్య‌గా మారుతోంది. అందుకే ఈ చీక‌ట్లో *కొంద‌రు* స‌ర్దుకుంటున్నారు. వారిలో మ‌న చంద్రాలు అనే రిమోట్‌ను చేతులో పెట్టుకున్న డ్రామోజీ ఉన్నాడు. చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపుతున్న రాజ‌గురువింద ఇటీవ‌ల ఓ అడుగు ముందుకేశారు. ఉద్యోగులు ఏ ఏట్ల‌కు పోతే నాకేంది!. అని సోమాజీగూడ‌, మూసాపేట కార్యాల‌యాల్లో ఉన్న వాళ్లంద‌రినీ రామోజీ ఫిలిం సిటీకి త‌ర‌లిస్తున్నాడు. కొన్నాళ్లు పోతే తెలంగాణ‌లోని అన్ని జిల్లాల డెస్క్‌ల‌ను కూడా అక్క‌డికే త‌ర‌లిస్తార‌ట‌. ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు డ్రామోజీ వేస్తున్న పాచిక‌లో తాజాగా మ‌రోటి బ‌య‌టికొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో తెలుగువారు ఎక్క‌డున్నా ఈనాడు వాళ్ల గ‌డ‌ప‌ను త‌ట్ట‌డంతో పాటు అక్క‌డి స్థానిక వార్త‌ల‌ను కూడా వారికి తెలుగు అక్ష‌రాల్లో అందించేందుకు ఒరిస్పా, త‌మిళ‌నాడు, ఢిల్లీ, మ‌హారాష్ట్ర ఎడిష‌న్ల‌ను కూడా చానాళ్ల కింద‌ట మొద‌లుపెట్టిండు. ఇప్పుడు వాట‌న్నింటినీ ఎత్తివేస్తున్నాడ‌ట‌. ఈనెల 16 నుంచి ఆ ఎడిష‌న్ల‌కు మంగ‌ళం పాడుతున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ట కూడా. కానీ క‌ర్ణాట‌క ఎడిష‌న్‌ను మాత్రం అదేవిధంగా కొన‌సాగిస్తార‌ని అంటున్నారు. ఎందుకంటే అక్క‌డ నుంచి యాడ్స్ (ప్ర‌క‌ట‌న‌లు) రూపంలో భారీగానే ఆదాయం వ‌స్తుంద‌ట‌. చూశారా... తెలుగు మీద ప్రేమ‌, తెలుగోళ్లంటే మ‌మ‌కారం... ఇవ‌న్నీ ఒట్టి మాట‌లే. రాజ‌కీయ చాప‌మీద ప‌వ‌ళించిన‌ ఫ‌క్తు వ్యాపార వేత్త... డ్రామోజీ!. ఇప్ప‌టికైనా ఆయ‌న బ‌హిరంగంగా దీనిని అంగీక‌రిస్తే బాగుంటుంది. కానీ ఇక‌ముందు కూడా సంద‌ర్భం వ‌చ్చిన‌పుడ‌ల్లా తెలుగు జాతిని మేల్కొల్పేందుకే తానేదో అక్ష‌ర సేద్యం చేస్తున్న‌ట్లుగా పేరాల‌కు పేరాలు ఎడిటోరియల్ రాస్తే మాత్రం అది ఆత్మ‌వంచ‌నే అవుతుంది.
కొస‌మెరుపు: ఈనాడులో గ‌త‌కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న అనూహ్య ప‌రిణామాల వెన‌క రిల‌య‌న్స్ ఆదేశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో మీడియా ప్ర‌పంచాన్ని గుప్పిట్లో పెట్టేందుకు చురుకుగా పావులు క‌దిపి చాలామేర‌కు స‌ఫ‌లీకృత‌మైన రిల‌య‌న్స్ ఏ క్ష‌ణంలోనైనా రామోజీ గ్రూపును సైతం టేకోవ‌ర్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేద‌నే టాక్ కూడా జోరందుకుంది. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు వాస్త‌వ‌ముంద‌నేది కాల‌మే చెప్ప‌నుంది.

No comments:

Post a Comment