1

1

Friday, 4 July 2014

జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన భూములు కూడా స్వాధీనం చేసుకోవాలి

తెలంగాణ ప్ర‌భుత్వం వినియోగించ‌ని స‌ర్కారు భూముల‌ను స్వాధీనం చేసుకునే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టి ద‌శాబ్దాలుగా బూజుప‌ట్టిన నిబంధ‌న‌కు తుప్పు వ‌దిలిస్తుంది. ఇదే ఊపులో జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన భూముల‌ను కూడా స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ల‌కు గ‌తంలో 80 ఎక‌రాల భూమి (వంద‌ల కోట్ల విలువైన భూమి) ఇచ్చారు. కానీ వీరు క‌నీసంగా ఏడేళ్ల అనుభ‌వం ఉండాల‌నే నిబంధ‌న పెట్టి కేవ‌లం 600-700 మంది జ‌ర్న‌లిస్టులే దానిని పంచుకోవాల‌ని చూశారు. ఇందులో అత్య‌ధికంగా సీమాంధ్ర జ‌ర్న‌లిస్టులే ఉన్నారు. సంఘంలో గొడ‌వ కార‌ణంగా ఇప్ప‌టికీ దానిని లేఅవుట్ కూడా చేయ‌లేదు. అందుకే వెంట‌నే ప్ర‌భుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఆత‌ర్వాత జ‌ర్న‌లిస్టులు మ‌రోసారి ఇళ్ల స్థ‌లాల కోసం విన‌తిప‌త్రం ఇస్తే దానిని ప‌రిశీలించాలి. ఇందులో స్థానిక‌త ఆధారంగా స్థ‌లాల కేటాయింపు జ‌ర‌గాలి. ఎందుకంటే రెండు రాష్ట్రములు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఎక్క‌డి వారికి అక్క‌డ స్థ‌లాలు ఇవ్వ‌డం స‌మంజసం. అందుకే ఇక్క‌డ తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే ఈ స‌ర్కారు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాలి. సీమాంధ్ర జ‌ర్న‌లిస్టుల‌కు
కొత్త రాజ‌ధానిలో (సింగ‌పూర్‌) స్థ‌లాలు ఇవ్వాలి. ఎట్టి ప‌రిస్థితుల్లో సీమాంధ్ర జ‌ర్న‌లిస్టుల‌కు ఇక్క‌డ స్థ‌లాలు ఇవ్వ‌ద్దు. ఎందుకంటే...

ఈ గ‌డ్డ‌పై ఉండి తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాశారు...
ఇక్క‌డ గాలి పీల్చి ఇక్క‌డి జ‌నం మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచారు...
వేలాది మంది తెలంగాణ యువ‌త బ‌లిదానాలు చేసినా చ‌లించ‌కుండా ట్యాంక్‌బండ్‌పై మ‌ట్టి బొమ్మ‌లు కూలితే ప్ర‌పంచం మునిగిపోయిన‌ట్లు లోకాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు...
క‌రెంటు స‌ర‌ఫ‌రా ఆపి మ‌న ఓయూ హాస్ట‌ల్‌ల విద్యార్థినిల‌ను పోలీసులు చావ‌గొడితే కించిత్తు స్పందించ‌నివారు సోకాల్డ్ మేధావి జేపీపై చెయ్యి ప‌డితే అది ప్ర‌జాస్వామ్యంలో చీక‌టిరోజుగా అభివ‌ర్ణించారు...
రాష్ట్రం విడిపోగానే సీమాంధ్ర యాజ‌మాన్యాల అండ చూసుకొని తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.
అందుకే వెంట‌నే ప్ర‌భుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి... సొంత రాష్ట్రంలో మ‌న జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే హైద‌రాబాద్‌లో ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాలి.

No comments:

Post a Comment