చెల్లని నాణెలు చెల్లడం ఏంటని ఆశ్చర్యపోకండి.. మామూలుగా ఎవరైనా నేత ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మరో చోట పోటీ చేస్తే... ఫలానా చోట చెల్లని నాణెం ఇక్కడ చెల్లుతుందా? అంటూ కేసీఆర్ గారు అప్పట్లో తెగ దెప్పిపొడిచారు..ముఖ్యంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను అయితే ఈ మాటతోనే ఓడించేశాడు... ఈ సూత్రాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు మరచిపోయారు.. మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మరో చోట అవకాశం ఇచ్చి వారిని గెలిపించుకుంటున్నారు...
పల్లా రాజేశ్వరరెడ్డి నల్లగొండ ఎంపీగా ఓడిపోయినా.. ఆయనను పట్టభద్రుల సెగ్మెంట్ నుంచి మళ్లా శాసన మండలికి పంపిస్తున్నారు.. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా... నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అయ్యారు... ఇంకా ఎన్ని చెల్లని నాణెలను కేసీఆర్ గారు చెల్లిపిస్తారో వేచిచూడాలి...!!
నోట్: చెప్పడం మరచిపోయాను.. బీజేపీ తరఫున గెలిచిన రాంచందర్‌రావు గారైతే మూడో దఫాలో చెల్లారు.. గతంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన ఆయన మూడో దఫాలో ఎమ్మెల్సీ అయి మొత్తానికి చట్టసభల్లో అడుగు పెడుతున్నారు..!!

No comments:
Post a Comment