తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి...
ఫ్లెక్సీలను తొలగించండి...
విశ్వనగరం దిశగా తొలి అడుగువేయండి..
********
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.. విశ్వనగరంలో ప్రతీ వీధిలోనూ ఫ్లెక్సీలు విచ్చల విడిగా ఉంటాయా? హైకోర్టు చీవాట్లు పెట్టినా స్పందించరా?
విశ్వనగరం దిశలో తొలి అడుగుగా... హైదరాబాద్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించండి... ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్న మీపై ఎక్కువ బాధ్యత ఉంటుంది..ఏ నాయకుడు టీఆర్ఎస్‌లో చేరినా సరే మొత్త ఫ్లెక్సీల మయంగా మారుతోంది నగరం... ఇది ఒక్క తెలంగాణలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది.. గతంలో ఒక మతం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో కింద వేసి తొక్కారని, తగలబెట్టారని వల్ల మత ఘర్షణలు జరిగాయి.. నరగంలో అసలు ఫ్లెక్సీలు లేకుండా చేస్తే ఎలా ఉంటుంది... దీనిపై అఖిలపక్ష, అన్ని మతాల పెద్దలతో మాట్లాడి హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది... ఫ్లెక్సీల తయారీ రంగంపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు చూపాలి.. నగరాన్ని అందంగా మార్చాలి...
నోట్: హైకోర్టు రెండు రాష్ట్రాలకు చీవాట్లు పెట్టింది... పక్క రాష్ట్రం వాళ్లు స్పందించినా స్పందించకపోయినా సరే మనం స్పందించాలి...
No comments:
Post a Comment