జగన్ కేసును విచారించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అవినీతిపరుల పాలిట సింహ స్వప్నమని.. ఆయన గొప్ప నిజాయతీపరుడైన అధికారని, ఆయన జీవిత చరిత్ర తెలిసేలా ఆంధ్రా ఎల్లో మీడియా పాఠకులకు అందించింది.. మరి ఓటుకు నోటు కేసును ఛేదించిన ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్... అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని.. ఆయనది ఆంధ్రా ప్రాంతమే అయినా పక్షపాతం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని ఏ ఒక్క ఆంధ్రా పత్రిక రాయడం లేదు ఎందుకు? రెండు అవినీతి కేసులే కదా.. జగన్, చంద్రబాబు ఇద్దరూ వీఐపీ నిందితులే కదా... మరి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇచ్చిన ప్రాధాన్యత ఏకే ఖాన్‌కు ఇవ్వకపోవడం వివక్ష కాదా? మీ పక్షపాత జర్నలిజానికి నిదర్శనం కాదా?
No comments:
Post a Comment