ఇన్‌ఛార్జిలు అక్కడోళ్లే.. ప్రతీ అక్షరం పక్షపాతరహితమే...
జల దోపిడీలో ఆంధ్రాకు సహకరిస్తున్న ఈనాడు..
మేలుకోకుంటే తీరని నష్టమే..
*******************
తెలంగాణలోని పాలమూరు, నల్లగొండలో చేపట్టనున్న ప్రాజెక్టులను ఎలాగైనా ఆపించాలన్న కుట్రలతో ఆంధ్రా ప్రభుత్వం చేస్తున్న పనులకు వత్తాసు పలుకుతూ, వెనకనుండి నడిపిస్తున్న ఈనాడు పత్రిక రాతలపై నిన్న టీ న్యూస్‌లో ఆంధ్రా నాడు అంటూ చర్చపెట్టారు.. రామోజీరావు పత్రిక ఎప్పుడూ ఆంధ్రా ప్రయోజనాల కోసమే పాకులాడుతుందని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం.. దయచేసి దీనిపై తెలంగాణ సర్కారు దృష్టిసారించాలి.. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకోవాలని, హైదరాబాద్‌పై మరిన్ని ఆంక్షలు రావాలని ఆకాంక్షిస్తున్నా ఆ పత్రికను, ఆ పత్రికాధినేతను దూరంగా ఉంచడమే మేలు.. ఓం సిటీకి భూములు ఇవ్వడం, రాయితీలు ఇవ్వడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు... లేకపోతే మన వేలితో మన కంటిని పొడుచుకున్న చందంగా తయారు కావడం తథ్యం.. ముఖ్యంగా తెలంగాణ ఎడిషన్‌కు ఆంధ్రా ప్రాంతీయులను ఇన్‌ఛార్జిలుగా పెట్టి తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడిచేలా కథనాలు రాయిస్తున్న ఈ పత్రికపై ప్రత్యేక దృష్టి పెట్టాలి... దీనిపై రామోజీరావుకు నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఉంది..
No comments:
Post a Comment