జరిగిన ఓటుకు నోటు వ్యవహారం జరగనట్లు.. జరగని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నటిస్తున్న అపరిచితుడు బాబు..
ఇదో రకం మానసిక జబ్బు అంటున్న వైద్యులు
ఇదో రకం మానసిక జబ్బు అంటున్న వైద్యులు
******************
మాములుగానే చంద్రబాబుకు అనుమానం ఎక్కువ.. తన నీడను చూసి తానే భయపడి పోతాడు.. పాపం అలాంటి పెద్ద మనిషి ఒక ఏడాది పాటు హైదరాబాద్‌లో తీవ్ర అభద్రతా భావంలోనే జీవించినట్లు ప్రస్తుత పరిణామాలతో అర్థం అవుతోంది... ముఖ్యంగా దక్షిణ భారతంలో బహుషా తొలిసారి ఈయనే ఫోన్ ట్యాపింగ్‌కు ఆద్యుడి(1990 దశకాల్లో)గా చెప్పుకోవచ్చేమో.. ఎన్టీఆర్ ను గద్దె దించి ఆయనపై ఇంటెలిజెన్సు నిఘాను, ఫోన్ల ట్యాపింగ్‌ను చేయించిన ఘనుడు చంద్రబాబు.. ఈ నేపథ్యంలోనే తనపైనా ఎవరైనా ఇలా చేయొచ్చన్న అనుమానాలు ఆయనను వెంటాడుతూ ఉన్నాయి.. పాపం ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో తన అనుంగు అనుచరుడు పట్టుబడటం, అందులో తన సంభాషణల టేపులు విడుదల కావడంతో గతంలో ఎన్టీఆర్‌పై తాను ఎలాగైతే ట్యాపింగ్‌లు చేయించానో అలాగే ఇప్పుడు తనపై జరుగుతున్నట్లుగా చంద్రబాబు ఒకరకమైన భ్రమలోకి వెళ్లినట్లుగా లేదా అలా నటిస్తున్నట్లుగా(అపరిచితుడిగా) అర్థం అవుతోంది.. ఇదో రకమైన మానసిక జబ్బు అని నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు విశ్లేషిస్తున్నారు.. జరిగిన ఓటుకు నోటు వ్యవహారాన్ని జరగని విషయంగా.. జరగని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఒక రకమైన వింత ప్రవర్తనకు ఆయన గురవుతున్నట్లు, మీడియాతోనూ, రాత్రి పడుకున్న సమయంలోనూ ఇలాగే కలవరిస్తుంటారని, ఇది ఈ వ్యాధి ముఖ్యలక్షణాలని వారు అంటున్నారు.. ఒకవేళ ఓటుకు నోటు కేసులో జైలులో పడ్డప్పుడు అనుభవించే దానికన్నా ఎక్కువ శిక్షను ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నట్లు వాళ్లు గుసగుసలాడుతున్నారు..
No comments:
Post a Comment