1

1

Friday, 5 June 2015

కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఒక్క స్టింగ్ ఆపరేష‌న్ జ‌ర‌గలేదా?

నిజంగా త‌ప్పులు చేయ‌డం, వాటిని క‌ప్పిపుచ్చుకోవ‌డంలో ఆంధ్ర నేత‌ల‌ను మించిన వారు లేరు.. ఆధారాలున్నా త‌ప్పు చేయ‌లేద‌ని బుకాయించ‌డం వారికే చెల్లింది.. క‌నీసం 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఆధారం లేక‌పోయినా కేసీఆర్ వ‌సూళ్ల మ‌నిషీ, సెటిల్‌మెంట్లు చేస్తాడ‌ని, దందాలు చేస్తాడ‌ని అపోహ‌లు సృష్టించ‌డం, అవే నిజ‌మ‌ని న‌మ్మేలా చేయ‌డంలో వారు కృత‌కృత్యుల‌య్యారు. తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపిన‌న్ని రోజులు అధికారంలో ఉన్న‌ది టీపీడీ, కాంగ్రెస్‌లే క‌దా.. ప్ర‌భుత్వ యంత్రాంగాలు వారి క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేసేవే క‌దా... మీడియా ఛానెళ్లు మొత్తం వారు చెప్పిన‌ట్లు వినేవే క‌దా.. మ‌రి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఒక్క స్టింగ్ ఆపరేష‌న్ జ‌ర‌గలేదా? మ‌రి కేసీఆర్ ఫోన్ల‌ను ట్యాప్ చేయ‌లేదా? చేసి ఉంటే అవి బ‌యట పెట్టొచ్చు క‌దా.. ఎందుకు పెట్ట‌లేదు..?
*************
ఇక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఐదో అభ్య‌ర్థిని పెట్ట‌డం అనైతికం అనే బాబు గారు... జ‌డ్పీ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌ల‌ప‌రిచిన వారు త‌క్కువ మంది గెలిచినా స‌రే రాత్రికి రాత్రి ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన వారిని చేర్చుకొని జ‌డ్పీ పీఠాల‌ను ఎన్నిసార్లు కైవసం చేసుకోలేదో తెలియ‌దా?
ఆయ‌న చేసిన ఈ ఘ‌న కార్యాన్ని ఈనాడు ప‌త్రిక వాళ్లు చ‌క్రం తిప్పిన బాబు.. జ‌డ్పీ పీఠం టీడీపీ వ‌శం అని ఎన్నిసార్లు హెడ్డింగ్ పెట్టి రాసిందే మీకు తెలియ‌దా?

No comments:

Post a Comment