1

1

Thursday, 4 June 2015

మ‌జిథియా సిఫార్సుల‌ను అమ‌లు పేరిట ఈనాడు కొత్త నాట‌కం...

మ‌జిథియా సిఫార్సుల‌ను అమ‌లు పేరిట ఈనాడు కొత్త నాట‌కం...
గ‌తంలో ఎక్కువ మొత్తం చెల్లించామ‌ని చెప్పి ఎరియ‌ర్స్‌లో భారీగా కోత‌లు పెట్టిన వైనం..
ఒకే బ్యాచ్‌లోని ఉద్యోగుల‌ బ‌కాయిల చెల్లింపుల్లోనూ వివ‌క్ష‌..
కొంద‌రికీ బ‌కాయిలిస్తే మ‌రికొంద‌రికి మొండిచేయి..
మ‌థ‌న ప‌డుతున్న ఉద్యోగులు..
పార‌ద‌ర్శ‌కంగా బ‌కాయిలు చెల్లించాల‌ని డిమాండ్‌
జ‌ర్న‌లిస్టు సంఘాలు స్పందించాల‌ని విజ్ఞ‌ప్తి..
*************
మ‌జిథియా క‌మిష‌న్ సిఫార్సుల‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్థించ‌డం, ఉద్యోగులు కోర్టుకు వెళ్ల‌డంతో గ‌త్యంత‌రం లేక ఉద్యోగుల జీతాల‌ను క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో రూపాయి మేర‌కు పెంచిన ఈనాడు ప‌త్రిక ఇప్పుడు ఎరియ‌ర్స్‌(బ‌కాయిల‌ను) కూడా చెల్లిస్తోంద‌ట‌.. విచిత్రం ఏంటంటే ఉద్యోగ‌ల జీతాల పెరుగుద‌ల‌లో కొంద‌రికీ అస‌లు ఒక్క రూపాయి పెర‌గ‌క‌పోయినా.. ఇంకొంద‌రికి రూపాయి, అర్ధ‌రూపాయి, చాలా త‌క్కువ మందికి మాత్రం రూ.2 వేల వ‌ర‌కు పెరిగిన విష‌యం తెలిసిందే. అయితే బ‌కాయిల చెల్లింపుల్లోనూ కొంద‌రికీ ఒక్క రూపాయి కూడా రాలేదు. కొంద‌రికి మాత్రం గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వ‌చ్చాయి.. ఎందుకిలా జ‌రిగింది...? మజిథియా సిఫార్సులు అమ‌లు చేస్తే అంద‌రికీ క‌నీసం రూ.ల‌క్ష‌కు పైగా వ‌స్తాయ‌ని, గ‌రిష్ఠంగా రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌స్తాయ‌ని ఆశించిన ఉద్యోగులంద‌రికీ భంగ‌పాటే ఎదురైంది. జీతాల చెల్లింపుల్లో అనుస‌రించిన‌ట్లుగానే బ‌కాయిల చెల్లింపుల్లోనూ చాలా చిత్ర విచిత్ర‌మైన విన్యాసాల‌ను యాజ‌మాన్యం ప్ర‌ద‌ర్శించింది. మ‌జిథియా క‌మిష‌న్ సిఫార్సుల ఆమోదానికి ముందు తాము ఎక్కువ చెల్లించామ‌ని, ఆ మేర‌కు కోత‌లు విధించామ‌ని, మ‌రికొంద‌రు పాత్రికేయుల‌కు పెట్రోల్ అల‌వెన్సులు, వేత‌నంతో కూడిన సెల‌వుల‌కు డ‌బ్బు చెల్లించామ‌ని, ఇవన్నింటినీ తీసేస్తే మిగిలిన మొత్తాన్ని బ‌కాయిలుగా ఇస్తున్నామని యాజ‌మాన్యం అంటోంది... అస‌లు సాక్షి ప‌త్రిక వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఆ సంస్థ‌లోకి వెళ్లే ఉద్యోగుల వ‌ల‌స‌కు క‌ట్ట‌డి వేసేందుకు కొంత మేర‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన రీతిలో జీతాలు పెంచిన ఈనాడు.. అప్పుడు పెంచిన జీతాల‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించిన జీతాలుగా ఇప్పుడు ప‌రిగ‌ణించి వాటిని ఎరియ‌ర్స్ నుంచి తొల‌గించ‌డం ఏంట‌ని ప‌లువురు సీనియ‌ర్ పాత్రికేయులు లోలోన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
ఇక ఒకే బ్యాచ్‌కు చెంద‌ని ఉద్యోగుల్లో కొంద‌రికీ రూ.50 వేల వ‌ర‌కు ఎరియ‌ర్స్ చెల్లించ‌గా కొంద‌రికీ చిల్లి గ‌వ్వ కూడా ఇవ్వ‌వ‌లేదు.. కార‌ణాలు అడిగితే త‌లాతోక లేని స‌మాధానం ఎదుర‌వుతోందని ప‌లువురు వాపోతున్నారు. అస‌లు ఎరియ‌ర్స్ చెల్లింపుపై లిఖిత‌పూర్వ‌కంగా రాసివ్వాల్సిందిగా కోరితే యాజ‌మాన్యం స్పందించ‌డం లేని అంటున్నారు. దీనిపైన న్యాయ‌పోరాటం చేయాల‌ని ఈనాడు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌లువురు పాత్రికేయులు భావిస్తున్నారు. గ‌తంలో ప‌ని ఆధారంగా ఇచ్చిన ప్రోత్సాహ‌కాల‌ను ఇప్పుడు ఎరియ‌ర్స్‌లో కోత పెట్ట‌డం ఏంట‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వేజుబోర్డు సిఫార్సులు అమ‌లు చేస్తే సోమాజీగూడ‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు వాస్త‌వంగా ఎంత జీతం పెరగాల్సి ఉందో త‌మ‌కు తెల‌పాల‌ని వారు కార్మిక శాఖ‌ను ఆశ్ర‌యించ‌డం లేక న్యాయ‌పోరాటం చేయాల‌ని నిశ్చియించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈనాడు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉద్యోగులంతా ఒక బృందంగా ఏర్ప‌డి సంఘ‌టితంగా యాజ‌మాన్యంపై పోరాటం చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిసింది. త‌మ‌కు ఒక్క రూపాయి ద‌క్క‌క‌పోయినా ప‌ర్వాలేదు కానీ పార‌ద‌ర్శ‌కంగా త‌మ‌కు ఎంత రావాలో? ఎంత మొత్తాన్ని గ‌తంలో అధికంగా చెల్లించామ‌ని యాజ‌మాన్యం భావిస్తుందో? లిఖిత‌పూర్వ‌కంగా రాసి ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జ‌ర్న‌లిస్టు సంఘాలు కూడా స్పందించాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. కోర్టు దృష్టిలో మాత్రం తాము మ‌జిథియా సిఫార్సుల‌ను అమ‌లు చేసిన‌ట్లు చూపేందుకే ఈ డ్రామా ఆడుతున్నార‌న్న అనుమానం వ్య‌క్తం అవుతోంది...

No comments:

Post a Comment