1

1

Thursday, 4 June 2015

బంజ‌రు భూముల‌ను ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం వాడుకోండి...!!

తెలంగాణ‌లో విశ్వ‌విద్యాల‌యం భూములు తీసుకొని పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తానంటారు ఒక‌రు..
దేశంలో రైతుల భూములు తీసుకొని పారిశ్రామిక సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడ‌తానంటారు మ‌రొక‌రు...
ఆంధ్రాలో ఏకంగా 33 వేల ఎక‌రాల భూమిని రాజ‌ధాని కోస‌మంటూ రైతుల నుంచి లాగేసుకున్నారు..
అస‌లు ఈ సువిశాల భార‌త దేశంలో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వానికి భూములే లేకుండా పోయాయా?
విద్యార్థుల అవ‌స‌రాల కోసం ఉన్న వ‌ర్సిటీల భూములు, దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌ల భూములే పాల‌క వ‌ర్గాల‌కు క‌నిపిస్తున్నాయెందుకు?
వాళ్లు బ‌ల‌హీనుల‌నా? ధ‌న బ‌లం లేని వార‌నా?
ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మ‌మే మీ అభిమ‌తం అయితే.. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఆంధ్రాలో క‌బ్జాకు గురైన‌, ఖాళీగా ఉన్న బంజ‌రు భూముల‌ను  ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం వాడుకోండి...!!
*****
నోట్‌: వ‌ర్సిటీల్లో 11 ఎక‌రాల భూమిని తీసుకుంటామ‌ని కేసీఆర్ అంటే అంతెత్తు లేస్తున్న పెద్ద మ‌నుషులంద‌రికీ వంద‌నాలు.. వ‌ర్సిటీ భూముల్లో పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టొద్ద‌ని, వాటిని విద్యాసంస్థ‌ల అవ‌స‌రాల కోసమే వినియోగించాల‌నే మీ ఆలోచ‌న మంచిదే....నేనూ ఏకీభ‌విస్తాను...
మ‌రి భూ సేక‌ర‌ణ చట్టంతో వేల ఎక‌రాల‌ను కార్పొరేట్‌కు క‌ట్ట‌బెట్టాల‌నుకునే మోడీ గారి నిర్ణయంపైనా, రాజ‌ధాని కోస‌మంటూ రైత‌న్న‌ల పొలాల‌ను లాగేసుకున్న చంద్ర‌బాబునాయుడి గారిపైన కూడా ఇదే తీరుగా నిర‌స‌న తెలిపితే సంతోషిస్తాం..!!

No comments:

Post a Comment