1

1

Friday, 12 September 2014

నీర‌జారావు గారికి ఫేసుబుక్‌లోకి స్వాగతం....









వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బంధువు తన భూమిని ఆక్ర‌మించుకున్నాడ‌ని పోరాటం చేసి గెలిచిన తెలంగాణ వ‌నిత నీర‌జారావు గారు గుర్తున్నారు క‌దా... ఆమె ఫేసుబుక్‌లో ఖాతాను తెరిచిన‌ట్లు అనిపిస్తుంది.. ఆమె ఫొటోతో సెప్టెంబ‌రు 10వ తేదీన ఫేసుబుక్ ఖాతా ఓపెన్ అయ్యింది... బ‌హుషా ఈ ఖాతా ఆమెదే అని నేను అనుకుంటున్నా... ఏది ఏమైనా ఆమె ఫేసుబుక్‌లోకి రావ‌డం మంచిదే..  అయితే ఆమె రెండు టీవీ ఛానెళ్ల ప్ర‌సారాల‌ను నిలిపివేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు..  అలాగే అర్నాబ్ గోస్వామిపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని కూడా ఒప్పుకోవ‌డం లేదు... వైఎస్‌పై ఆమె భూ పోరాటం చేసిన స‌మ‌యంలో ఆ రెండు ఛానెల్స్ త‌ప్ప ఎవ‌రూ ఆమెకు అండ‌గా నిల‌వ‌లేదని చెబుతున్నారు....   మీడియాకు ప్రాంతీయ ప‌క్ష‌పాత ధోర‌ణి లేద‌ని ఆమె వాదిస్తున్నారు... ఒక‌వేళ ఛానెళ్ల‌ను నిషేధించ‌డం అంటే నీడ‌నిచ్చే చెట్టును న‌రుక్కున్న‌ట్లే అంటున్నారు... ఇది నిజ‌మేనా... ?  ఆమె వాద‌న వాస్త‌వ‌మేనా...?   నేను అసాంజే పేరు పెట్టుకుని రాస్తున్న‌ట్లు ఎవ‌రైనా నీర‌జారావుగారి పేరుతో రాస్తున్నారా?  ఎందుకంటే ఇన్నేళ్లుగా అకౌంట్ తెర‌వ‌ని ఆమె సెప్టెంబ‌రు 10వ తేదీన అకౌంట్ తెరిచారు కాబ‌ట్టి ఈ సందేహం.....



అయితే ఆమె ఎవ‌రైనా స‌రే... వైఎస్‌పై పోరాటం స‌మ‌యంలో ఆమెకు అండ‌గా నిలిచింది చంద్ర‌బాబునాయుడా?   లేక టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్సా అన్న విష‌యంలో నీర‌జారావు గారికి క్లారిటీ ఉండాలి.. ఎందుకంటే మొన్న  జ‌న‌వ‌రి నెల‌లో టీడీపీ నిర్వ‌హించిన యువ చైత‌న్య స‌ద‌స్సులో నీర‌జారావు గారు దాదాపు అర‌గంట‌పాటు అన‌ర్ఘళంగా మాట్లాడారు.. అందులో వైఎస్‌పై పోరాటం చేసిన స‌మ‌యంలో ఆమెకు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచింది చంద్ర‌బాబునాయుడు గారే అని బ‌ల్ల‌గుద్ది చెప్పారు... చంద్ర‌బాబునాయుడు వ‌ల్లే హైద‌రాబాద్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు వ‌చ్చింద‌ని అన్నారు.... చంద్ర‌బాబునాయుడును మించిన నాయ‌కుడు ఎక్క‌డా లేడ‌ని.. ఆయ‌న అండ లేకుంటే నా పోరాటం విజ‌య‌తీరాల‌కు చేరేది కాద‌న్నారు.. మ‌రి ఆమెకు అండ‌గా నిలిచింది... చంద్ర‌బాబా?   లేక ఆ రెండు ఛానెల్స్ యేనా... లేక ఆ చంద్ర‌బాబు అండ‌గా ఉండ‌టం అంటే ఆ ఛానెల్స్ అండ ల‌భించిన‌ట్లేన‌న్న‌ది ఆమె భావ‌నా....?

No comments:

Post a Comment