1

1

Thursday, 27 November 2014

రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతాడా?

రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతాడా?
అంటే ఏ పార్టీ త‌ర‌ఫున అన్న‌ది తొలుత ఉత్ప‌న్న‌మ‌య్యే ప్ర‌శ్న‌..
2019 నాటికి ఆయ‌న సొంతంగా పార్టీ పెట్టి కేసీఆర్ మాదిరిగా ఉద్య‌మించి తెలంగాణ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌న్నా ఎక్కువ‌గా కొట్లాడితే ప్ర‌జాభిమానాన్ని పొందుతాడు.. అయితే హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం కొట్లాడ‌టం అంటే పొరుగు రాష్ట్రం చేసే దాడుల‌ను తిప్పికొట్టాల్సి ఉంటుంది, అక్క‌డి సీఎంతో నేరుగా త‌ల‌పడాల్సి ఉంటుంది.. మ‌రి ఆ ప‌నిని రేవంత్‌రెడ్డి చిత్త‌శుద్ధితో చేస్తే 2019లో కాక‌పోయినా 2029 నాటికైనా ఆయ‌న‌ను జ‌నం అంద‌లం ఎక్కించ‌డం ఖాయం.. రేవంత్‌రెడ్డే కాదు.. ఏ నాయ‌కుడైనా స‌రే చిత్త‌శుద్ధితో పార్టీ పెట్టి న్యాయం కోసం కొట్లాడితే జ‌నం వారికి త‌గిన గౌర‌వం ఇవ్వ‌డం త‌థ్యం...
జార్ఖండ్ సాధ‌న కోసం దాదాపు 30 ఏళ్ల‌కు పైగా శిబూసోరెన్ కొట్లాడాడు.. ఆయ‌న‌ను గురూజీగా జార్ఖండ్ ప్ర‌జ‌లు గౌర‌విస్తున్నారు..
తెలంగాణ కోసం 12 ఏళ్లు కేసీఆర్ కొట్లాడాడు.. జ‌నం గుండెల్లో నిలిచాడు..
మ‌రాఠాల అస్థిత్వం కోసం కొట్లాడిన బాల్ థాక‌రేకి అక్క‌డి ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక స్థానం ల‌భించింది..
ఏమో.. రేపు బోయ‌వాడు వాల్మీకిలా మారిన‌ట్లుగా రేవంత్‌రెడ్డి క‌ర‌డు గ‌ట్టిన తెలంగాణ వాదిగా మారిపోయి ఏకంగా చంద్ర‌బాబునాయుడిపైనా దాడికి తెగ‌బ‌డితే... ఆయ‌న క‌ల సాకారం కావొచ్చు క‌దా... రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...!!!
మ‌రి రేవంత్‌డు అలా మారుతాడా? మారితే ఎప్పుడు మారుతాడు? అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌...!!
నోట్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టం వ‌ల్ల రేవంత్ రెడ్డి క‌నీసం ముఖ్య‌మంత్రి పీఠంపై క‌ల‌లు క‌న‌గ‌లుగుతున్నాడు.. స‌మైక్య రాష్ట్ర‌మే ఉంటే మంత్రి ప‌ద‌వి కోసం క‌ల‌లు క‌నేవాడు.. క‌నీసం ఈ విష‌యంలోనైనా ఆయ‌న కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిందే..!!

No comments:

Post a Comment