ఆత్మగౌరవ ప్రతీక ఈ బడ్జెట్..!!
ఏ ఈటెల రాజేందర్‌ను అసెంబ్లీలో అవమానించారో.. అదే ఈటెల ఈరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు..
-------------------
బడ్జెట్ కేటాయింపులు, అంకెల గారెడీలు, విపక్షాల విమర్శలు అన్నీ పక్కన పెట్టి సాధారణ కోణంలో చూస్తే ఈ రోజు తెలంగాణ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయినట్లే...
మేం లేకపోతే మీరు ఒక్క రోజు కూడా బతకలేరు.. మీకు పరిపాలించుకోవడం రాదు.. మీకు వ్యవసాయం చేతకాదు.. మాట్లాడటం రాదు.. మీకు చిల్లి గవ్వ ఇవ్వం అని ఎన్నో మాటలు అన్న వాళ్ల నోళ్లన్నీ మూతపడిన రోజుది.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. దాదాపు 4 నెలలుగా ఎవరి మద్దతు లేకుండా స్వతంత్రంగా స్వీయ రాజకీయ శక్తి ఇక్కడ పాలిస్తోంది.. ఇప్పుడు రాష్ట్ర తొలి బడ్జెట్‌ను సగర్వంగా ప్రవేశపెట్టింది....
అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 10 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చిన సమయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉన్న ఈటెల రాజేందర్‌ను పట్టుకుని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వికటాట్టహాసంతో... ఏం రాజేందర్.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని అత్యంత వ్యంగ్యంగా అన్నారు...
ఇప్పుడు అదే ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా తల ఎత్తుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు... అప్పట్లో అవహేళన చేసిన వాళ్లు సిగ్గుంటే తలదించుకోవాల్సిన రోజులివి... ఇది తెలంగాణ చరిత్రల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం..!!

No comments:
Post a Comment