1

1

Monday, 3 November 2014

క‌థ‌నాలందు రైతుల‌ ఆత్మ‌హ‌త్య‌ల క‌థ‌నాలే వేర‌యా?

ఇది ఓ ఎల్లో మీడియా తీరు...
తెలంగాణ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఎఫ్ఐఆర్ ఉంటేనే వార్త‌లు...
రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఎఫ్ఐఆర్ లేకున్నా వార్త‌లే...
ఎందుకీ తేడా...
--------------
తెలంగాణ ఉద్య‌మంలో ఓ విద్యార్థి కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు.. వార్త డెస్కుకు వ‌చ్చింది... అంతే ఆ డెస్కు ఇన్‌ఛార్జిగారు.. అస‌లు ఎఫ్ఐఆర్ న‌మోదు అయిందా?   అందులో తెలంగాణ కోస‌మే చ‌నిపోయిన‌ట్లు రాసి ఉందా?   కుటుంబ క‌ల‌హాలు, అప్పులు, ప్రేమ‌లాంటివ్య‌క్తిగ‌త కార‌ణాలు ఏమైనా ఉన్నాయా?  అంటూ స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు అడిగాడు... ఒక‌వేళ ఎఫ్ఐఆర్‌లో తెలంగాణ కోసం అని లేకుంటే దాన్ని తెలంగాణ కోసం జ‌రిగిన ఆత్మ‌హ‌త్య‌గా ప‌రిగ‌ణించేవారు కాదు... ఇలా చాలా కేసులు జ‌రిగాయి.. ఒక‌వేళ ఎవ‌రైనా విద్యార్థి లేఖ రాసి చ‌నిపోయినా.. ఆ లేఖ ఆయ‌న స్వ‌ద‌స్తూరితో రాసిందేనా?  అంటూ వంద‌లాది ప్ర‌శ్న‌లు వేసేవారు... తెలంగాణ కోసం యువ‌త చ‌నిపోతే ఎఫ్ఐఆర్ చూస్తారు.. అందులో పేర్కొన్న కార‌ణాల‌ను చూసి వార్త‌లు వేశారు...

---------------
మ‌రి ఇప్పుడు తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఎఫ్ఐఆర్‌లు చూడ‌టం లేదు...  క‌నీసం కేసు న‌మోదైందా?  అన్న‌ది ఆరా తీయడం లేదు... రైతు ఆత్మ‌హ‌త్య అంటూ వేసేస్తున్నారు..  మ‌రి తెలంగాణ యువ‌త సూసైడ్ లేఖ‌లు రాసి చనిపోయిన‌ప్పుడు మీరు ఎఫ్ ఐఆర్‌లు కావాల‌న్న‌ప్పుడు నేడు రైతు ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలోనూ ఎఫ్ ఐఆర్‌లూ, అందులో పేర్కొన్న కార‌ణాలు అన్వేషించి రాయాలి క‌దా.. ఎందుకు రాయ‌డం లేదో?
----------------------------

మీరు ప్ర‌స్తుతం రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై రాస్తున్న ప‌ద్ధ‌తిలోనే 2009 డిసెంబ‌రు 9 నుంచి 2014 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రిగిన యువ‌త బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల కేసుల‌ను రాసి ఉంటే ఆ సంఖ్య 10 వేలు దాటేది... మ‌రి అప్పుడు ఈ ప‌ద్ధ‌తిలో ఎందుకు రాయ‌లేదు.. ఇప్పుడెందుకు రాస్తున్నారు..?  

రైతుల‌పై ప్రేమ‌తోనా... స‌ర్కారుపై అక్క‌సుతోనా... మీ అంత‌రాత్మ‌ల‌నే ప్ర‌శ్నించుకోండి!!

No comments:

Post a Comment