1

1

Sunday 2 November 2014

ఈనాడులో మ‌రుగుతున్న డాల్డా!

సాధార‌ణంగా పండుగ స‌మ‌యాల్లో అంద‌రి ఇండ్ల‌లో వంట‌ల కోసం డాల్డా మ‌రుగుతుంది. కానీ ఈనాడు సంస్థ‌లో ఈ ప‌దం గ‌త కొన్నిరోజులుగా మ‌రుగుతూనే ఉంది. హైద‌రాబాద్ శివారులో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెల ముఠా గుట్టు ర‌ట్ట‌యింది. దీంతో సిటీబ్యూరో ప్ర‌ధాన ప్ర‌తినిధి అయిన న‌ర్సింహారావు ఆరోజు పండుగ చేసుకున్నారు. కాలు క‌ద‌ప‌కుండా స‌మాచారాన్ని తెప్పించుకొని ఒక క‌థ‌నాన్ని వండి వార్చారు. ఈనాడులో కొంద‌రు బ‌డా జ‌ర్న‌లిస్టులు చేసే ప‌నే ఆయ‌న చేశారు. అయితే అందులో డాల్డా అనేది ఒక ప‌దార్థంగా ఆయ‌న భావించి.. క‌థ‌నంలో ఉద‌హ‌రించారు. డాల్డా వాడ‌కంలో ఈ నూనె వాడుతున్నార‌ని పేర్కొన్నారు. కానీ డాల్డా అనేది ఒక కంపెనీ పేరు. ఇంకేముంది... సీను సితారైంది. స‌ద‌రు కంపెనీ క‌న్నెర్ర జేయ‌డంతో కొన్నిరోజుల కింద‌ట వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ రూ.ఐదువేల కో్ట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీ ఊరుకుంటుందా... బిడ్డా మేం రాసిచ్చిన‌ది ఇచ్చిన‌ట్లుగా మొద‌టి పేజీలో వేయాల‌ని, లేక‌పోతే ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని హెచ్చ‌రించింది. అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌ల త‌ర్వాత గ‌త ఆదివారం ఇలా మొద‌టి పేజీలో ఈనాడు చ‌రిత్ర‌లో ఎన్న‌డూలేనిరీతిలో ఒక బూట‌కపు క‌థ‌నం రాసినం... అందులో ఈ కంపెనీ పేరు ఉంది. దాని గిరాకీ ప‌డిపోయింది. అందుకు చింతిస్తున్నం. ఈ డాల్డా కంపెనీలో ఎలాంటి క‌ల్తీ లేదు అని వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇదంతా సాధార‌ణం కావ‌చ్చు. కానీ ఈనాడులో కొన్నేండ్ల కింద‌ట రామోజీరావుకు యుద్ధ‌వీర్ అవార్డు వ‌చ్చింద‌ని పాత వార్త‌ను ఒక బిట్‌గా వేశారు. వాస్త‌వంగా ఒక కంట్రిబ్యూట‌ర్ ఆ బిట్ రాస్తే దానికి బాధ్యుల‌ను చేసి ఒక రిపోర్ట‌ర్‌ను రాజీనామా చేయించారు, మ‌రో రిపోర్ట‌ర్‌ను క‌ర్ణాట‌క డెస్క్‌కు బ‌దిలీ చేశారు. అది తెలియ‌క చేసిన పొర‌పాటు. కానీ ఇద్ద‌రికి శిక్ష విధించారు. మ‌రి ఆ వార్త‌ను పాస్ చేసిన స‌బ్ ఎడిట‌ర్‌, అంద‌రికంటే మేధావిని అనుకుని భ్ర‌మ ప‌డే జ‌న‌ర‌ల్ డెస్క్ ఇన్‌ఛార్జి రాహుల్‌పై మాత్రం కించిత్తు చ‌ర్య తీసుకోలేదు.

అయితే ఇప్పుడ ఈ డాల్డా వార్త‌కు బాధ్యుడైన ఉండ్రు న‌ర్సింహారావుపై చ‌ర్య తీసుకోవాలి. క‌నీస ప‌రిశీల‌న లేకుండా క‌థ‌నాలు రాసే వ్య‌క్తిని బ్యూరో ఇన్‌ఛార్జిగా ఎలా ఉంచుతాం అని యాజ‌మాన్యం సిగ్గుతో త‌ల‌వంచుకోవాలి. కానీ ఈనాడు పెద్ద‌లు కొంద‌రు... రిపోర్ట‌ర్ చిన్న త‌ప్పు చేస్తే భూత‌ద్దంలో పెట్టి పండుగ చేసుకునే ఈ ఘ‌నులు.. ఉండ్రు న‌ర్సింహారావును కాపాడేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని రో్జులుగా ఈనాడు ప్ర‌ధాన పేజీలో సిటీబ్యూరో ప్ర‌ధాన ప్ర‌తినిధి పేరిట పాత చింత‌కాయ ప‌చ్చ‌డి వార్త‌ల‌ను పెద్ద‌గా వేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే... గ‌త ఆదివారం వ‌చ్చిన వివ‌ర‌ణ‌పై రామోజీరావు బాధ్యుడిపై చ‌ర్య తీసుకోవాల‌ని రాసాడ‌ట‌. ఇంకేముంది... ఉండ్రును కాపాడేందుకు పెద్ద పెద్ద వార్త‌ల‌తో ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇది వాళ్ల సొంత విష‌యం కావ‌చ్చు. కానీ సాధార‌ణ రిపోర్ట‌ర్ అయినా, ఇన్‌ఛార్జి అయినా త‌ప్పు త‌ప్పే, శిక్ష శిక్షే క‌దా. అంతేకాదు మామూలు జ‌ర్న‌లిస్టుల‌ను క‌ర్క‌శంగా, వాళ్ల కుటుంబాలు వీధిన‌ప‌డ‌తాయ‌నే మాన‌వ‌త్వం లేకుండా రాజీనామాలు చేయించుకునే ఈనాడులోని సోకాల్డ్ మేధావి బ్యాచి ఉండ్రు విష‌యంలో ఎందుకు ఇంత ఆరాట‌ప‌డుతుంది?. ఆయ‌న‌కి, వీళ్ల‌కి మ‌ధ్య సంబంధం ఏంది?. అదెలాంటి సంబంధం? ప‌్ర‌స్తుతం ఈనాడులో నాలుగురోజులుగా హాట్ టాపిక్‌గా మారిన అంశం ఇదే.

No comments:

Post a Comment