కార్మిక శాఖలో వందల కోట్ల రూపాయల ఆంధ్ర లూఠీ విషయం బయటికి రాగానే సిగ్గుతో బాత్‌రూంకు పరిమితం కావాల్సిన ఆంధ్ర నాయకులు, సోకాల్్డ మేధావులు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్నరు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ రెండ్రోజుల కిందట ప్రెస్‌మీట్ పెట్టారట. అందులో ఎందీ రాద్దాంతం... తెలంగాణ సీఎస్, ఏపీ సీఎస్‌కు ఒక్క ఫో్న్ కాల్ చేస్తే సరిపోయేది కదా అని అన్నాడట. మరి... లూఠీ చేసే ముందు ఏపీ సీఎస్ చొరవ తీసుకొని తెలంగాణ సీఎస్‌కు ఫోన్ చేసి.. మా సర్కారు చెప్పినట్లు మేం లూఠీ చేస్తున్నం అంటే సరిపోయేది కదా. అయినా తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు ఈ లూఠీ బయటపడింది. 57 ఏండ్ల దోపిడీ ఇట్ల రెడ్‌హ్యాండెడ్‌గా ఎప్పుడైన బయటపడిందా?. ఈ విషయాన్ని అదే పరకాల ప్రభాకర్‌తో అడిగెటోడెవడు?. రాసెటోడెవడు?
No comments:
Post a Comment