తెలంగాణలో కరెంటు కష్టాలు ఇప్పటికిప్పుడు తీరేవి కావు. కేసీఆర్ అన్నట్లు అది దుకాణంల దొరికేది కాదు. అయితే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఒక మంచి సలహా ఇచ్చాడు. మన ఎన్‌టీపీసీలో కేంద్రానికి 75 శాతం కరెంటు వాటా ఉంది. ఆ వాటా కింద వచ్చే కరెంటును కేంద్రం పలు రాష్ట్రాలకు ఇస్తుంది. మనం చత్తీస్‌గడ్‌తో వెయ్యి మెగా వాట్లకు ఒప్పందం చేసుకున్నా లైను వేయడానికి కనీసంగా సంవత్సరం, సంవత్సరంనర పడుతుంది. అందుకే కేంద్రాన్ని ఒప్పించి... ఎన్‌టీపీసీలో దాని వాటా ఉన్న కరెంటును ఇక్కడే మనం సర్దుబాటు చేసుకుంటె... చత్తీస్‌గడ్‌కు కేంద్రం ఇచ్చే వాటా, అక్కడి నుంచి లైన్లు ఉన్న రాష్ట్రానికి ఇచ్చే వాటా ఎంతనో చూసుకొని అక్కడ వెయ్యి మె.వాట్లు సర్దుబాటు చేస్తే బాగుంటుంది. ఎన్‌టీపీసీ నుంచి కాబట్టి మనం తొందరగ అవసరమైతె కొత్త లైన్లు వేసుకోవచ్చు. మంచి ఎవరు చెప్పినా మంచే కదా.
No comments:
Post a Comment