నిన్నటికి నిన్న ఈనడులో డాల్డా మరుగుతున్న సంగతి మిత్రులందరికీ తెలుసు. ఇంత పెద్ద తప్పు చేసి... కనీస పరిజ్ఙానం లేకుండా రాసి.. ఈనాడు చరిత్రలో ఎన్నడూలేని విధంగా నిస్సిగ్గుగా వివరణ వేయడానికి కారణమైన ఆంధ్ర జర్నలిస్టును మిడిల్ మేనేజ్‌మెంట్ , కిరణ్‌తో సహా (అందరూ ఆంధ్రోళ్లే) ఎలాంటి చర్యలు లేకుండా కాపాడుతున్నారు. కానీ ఎలాంటి తప్పు చేయని తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, నిజామాబాద్ బిడ్డ దిలీప్‌ను మాత్రం నిర్దాక్షిణ్యంగా బయటికి పంపారు. ఈనడు ఆంధ్ర కావరానికి పరాకాష్టగా మారిన ఈ సంఘటనను మిత్రులందరి దృష్టకి తేవాలన్నదే నా ఉద్దేశం. బిజినెస్ బ్యూరోలో దిలీప్ అనే తెలంగాణ జర్నలిస్టు దాదాపు 15 ఏండ్లకు పైగా ఈనాడులో పని చేస్తున్నారు. మంచి నైపుణ్యం, మంచి తనం ఉన్న ఆయన ఈ వారంలోనే ఒకరోజు సత్య నాదేండ్ల జీతంపై ఒక వార్త రాశారు. దానిని బిజినెస్ పేజీలో వేశారు. ఇదేందీ... ఇది మొదటి పేజీ వార్త కదా అని ఛైర్మన్ రామోజీ కామెంట్ రాశారట. దీంతో్ వాస్తవంగా డెస్్క బాధ్యలుగానీ, బిజినెస్ బ్యూరో ఇన్‌ఛార్జిగానీ, చివరకు సెంట్రల్ డెస్క్ ఇన్‌ఛార్జి రాహుల్ (మంచి జరిగితే అంతా నా క్రెడిట్... లేకుంటే చేతులు దులుపుకునే ఘనుడు)నుగానీ బాధ్యులు చేయాలి. జర్నలిజంలో్ ఇది నైతికత. కానీ వీరంతా ఆంధ్రోళ్లు కావడంతో దిలీప్‌ను బాధ్యుడిని చేశారు. ఎలాగంటే... ఆయన రాసిన వార్త మొదటి పేజీలో వేసే స్థాయిలో లేదట. మరి వార్త రాసిన రోజు... చూసిన డెస్క్ వాళ్లు, ఎడిషన్‌ను ఆమోదించిన సెంట్రల్ డెస్క్ ఇన్‌ఛార్జి అప్పడేం చేసిండ్రు?. వాస్తవంగా వాళ్లకు అది మొదటి పేజీలో వేయాలనే ఆలోచనే రాలేదు. తీరా రామోజీ అనగానే తమకు మట్టి అంటకుండా ఉండేందుకు ఆతర్వాత వార్త రాసిన స్థాయి సరిగాలేదనే సాకును తెరపైకి తెచ్చి... దిలీప్‌ను అవమానించారు. తెలంగాణ బిడ్డ కదా... రక్తంలో రో్షం ఉంటుంది. అందుకే ఎహపో... అంటూ రాజీనామా లేఖ పడేసి వచ్చేశారు. నిజంగా దిలీప్‌తో నాకు ముఖ పరిచయం కూడా లేదు. కానీ ఒక తెలంగాణ బిడ్డ, నైపుణ్యం ఉన్న జర్నలిస్టు గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అదేవిధంగా ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు నాకు ఎలాంటి భయం లేదు.
No comments:
Post a Comment