1

1

Monday, 20 October 2014

ఈ సంక్షోభ ప‌రిస్థితుల్లో లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి పిలుపే మ‌న‌కు ఆద‌ర్శం కావాలి..



విజ్ఞ‌ప్తి...
-----------------------
ఈ సంక్షోభ ప‌రిస్థితుల్లో
లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి పిలుపే మ‌న‌కు ఆద‌ర్శం కావాలి..
ఆయ‌న‌ ఒక రోజు ఉప‌వాసానికి పిలుపునిచ్చారు..
---------------------
మ‌నం ఏసీలు, కూల‌ర్లు, ఫ్రిడ్జిల వాడ‌కాన్ని ఆపేద్దాం..
మ‌నం ఫ్యాన్లు లేకున్నా బ‌తుకుతాం...
కానీ విద్యుత్ లేక రైతు చ‌స్తున్నాడు.. ఆయ‌న‌ను బ‌తికించేందుకు మ‌నం కృషి చేద్దాం...
ప‌ల్లెల్లో వెలుగు నింపుదాం...
ఈ విష‌యంలో నాయ‌కులు ఆద‌ర్శంగా నిల‌వాలి...
అవ‌స‌ర‌మైతే ఆరు బ‌య‌ట స‌మావేశాలు పెట్టుకోండి... విద్యుత్ పొదుపునకు కృషి చేయండి......
-------------------------
1965 ప్రాంతంలో దేశంలో ఆహార కొర‌త‌, మ‌రోవైపు పాకిస్థాన్ యుద్ధం సంభ‌వించింది... ఈ స‌మ‌యంలో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి గారు ఇచ్చిన పిలుపు దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించింది.. ఆహార దిగుమ‌తులు స‌రిప‌డ‌ని ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఆహార భారాన్ని త‌గ్గించేందుకు వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు.. అది సోమ‌వార‌మైనా, మంగ‌ళ‌వార‌మైనా స‌రే అని సూచించారు...ఇది చేస్తూనే ఆహార సమృద్ధ దేశంగా మార్చ‌డానికి ఆయ‌న‌ ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.. ఆ రోజుల్లో దేశ‌ ప్ర‌జ‌లు దాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించారు.. క‌ఠోర ఉప‌వాసాన్ని చేశారు... విచిత్రం ఏంటంటే దేశం ఇప్పుడు ఆహార స‌మృద్ధిని సాధించిన‌ప్ప‌టికీ ఉత్త‌ర భార‌త దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దేశం కోసం ఒక రోజు ఉప వాసాన్ని కొన‌సాగిస్తున్నారు.. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిగారి పిలుపును, స్ఫూర్తిని కొన‌సాగిస్తున్నారు..
1965లో లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రిగారు క‌ర్ష‌కుల్లో ప్రేర‌ణ కోసం జై కిసాన్‌ నినాదాన్ని ఇచ్చారు.. ఇక యుద్ధంలో సైనికుల‌కు ఉత్తేజాన్ని నింపేలా జై జ‌వాన్ నినాదాన్ని ఇచ్చారు...
-------------------------------------
ఇప్పుడు మ‌న తెలంగాణ సంక్షోభంలో ఉంది..తీవ్ర‌మైన‌ విద్యుత్ సంక్షోభంలో ఉంది.. ఈ స‌మ‌యంలోనూ మ‌న‌కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిలా పిలుపునిచ్చేవారు కావాలి.... ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారే ఆ బాధ్య‌త‌ను తీసుకోవాలి... విద్యుత్ డిమాండ్‌ను త‌గ్గించేందుకు ప్ర‌జ‌లంద‌రూ త‌మ‌వంతుగా విద్యుత్ పొదుపును పాటించాల‌ని సూచించాలి.... ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, గృహాల‌లో ఏసీల వాడాకాన్ని పూర్తిగా నిషేధించాలి.... ఇంకా సౌర విద్యుత్ వినియోగం సాధ్య‌మ‌య్యే చోట దాన్ని ప్రోత్స‌హించాలి...
మొన్న మోడీ గారు చెప్పిన‌ట్లు పౌర్ణ‌మి రోజున వీధి దీపాలు ఆపేయ‌డం చేయాలి....
గ్లోబ‌ల్ వార్మింగ్‌ను త‌గ్గించేందుకు ఎర్త్ అవ‌ర్‌ను నిర్వ‌హిస్తారు.. అలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి.... దుబారాను అరిక‌ట్ట‌డ‌మూ.. స్వ‌చ్ఛందంగా ఏసీలు, కూల‌ర్లు, ఫ్రిడ్జిల వాడాకాన్ని ఈ సంక్షోభ స‌మ‌యంలో నిలిపేయ‌డం ఉత్త‌మం...
------------------------------
క‌రెంట్ లేక రైతులు చ‌నిపోతున్నారు... ఈ స‌మ‌యంలో మ‌న ఫ్రిడ్జిలు పెట్టుకొని చ‌ల్ల‌ని నీళ్లు తాగ‌క‌పోతే చ‌చ్చిపోం క‌దా... ఇక ఏసీలు లేక‌పోతే చ‌చ్చిపోయే ప‌రిస్థితి లేదుక‌దా... ఆలోచించండి... ఇది ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఉన్న ప్ర‌జ‌లు మాత్ర‌మే చేయ‌గ‌లిగిన ప‌నులు... ఎందుకంటే గ్రామాల్లో అస‌లే క‌రెంట్ ఉండ‌టం లేదు కాబ‌ట్టి... సంక్షోభ స‌మ‌యంలో తిట్టుకోవ‌డాలు చేయ‌డం క‌న్నా నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇస్తే బాగుంటుంది... ఆ సూచ‌న‌లు ఎవ‌రు ఇచ్చిన ప్ర‌భుత్వం స్వీక‌రించాలి... ఇది నా విజ్ఞ‌ప్తి..
నోట్: ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌మ ఇళ్ల‌లోనూ ఏసీల వినియోగాన్ని పూర్తిగా నిలిపేయాలి... ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి...

No comments:

Post a Comment