1

1

Sunday, 19 October 2014

మ‌న‌దీ ఒక బ‌తుకేనా?..ప్రాంతాన్ని బ‌ట్టి మాన‌వ‌త్వం మారుతుందా?


మ‌న క‌ష్టాలు క‌ష్టాలుకావా?
తెలంగాణ వాదుల్లారా ఒక్కసారి ఆలోచించండి...
---------------------------------
ఈ గ‌డ్డ‌పై వ్యాపారం మొద‌లుపెట్టారు... ఈ నీటిని తాగారు.. ఈ నేల‌ను వాడుకున్నారు.. వేల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు.. క‌లిసున్న‌ప్పుడు వంచించారు.. చివ‌ర‌కు రాజ్యాంగ‌బ‌ద్ధంగా విడిపోయిన త‌ర్వాత కూడా ఆంధ్ర పాట పాడుతున్నారు. నిన్న రాధాకృష్ణ‌, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్మించాల్సిన రాజ‌ధాని కోసం విరాళాల కోసం త‌న ప‌త్రిక‌ను వినియోగించాడు. ఇప్పుడు రామోజీరావు మూడు జిల్లాలు న‌ష్ట‌పోయాయ‌ని ఏకంగా రూ.3 కోట్ల‌తో స‌హాయ నిధిని ఏర్పాటు చేశాడు.
కానీ, ఏ నాడు క‌ర‌వు కోర‌ల్లో చిక్కుకున్న తెలంగాణ కోసం, కాలం క‌ల‌సి రాక అప్పుల బాధ‌తో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పుడుతున్న రైతాంగం కోసం, ఫ్లోరైడ్ బాధితుల కోసం, వ‌ల‌స పోతున్న పాల‌మూరు జ‌నం కోసం, చివ‌ర‌కు నిస్వార్థంగా తెలంగాణ ఉద్య‌మంలో అసువులు బాసిన అమ‌రుల‌ కుటుంబీల కోసం విరాళాలు సేక‌రించ‌లేదు. స‌హాయ నిధులు ప్రారంభించ‌లేదు.. నాడైనా, నేడైనా సీమాంధ్ర వాసుల‌కు చీమ కుట్టినా దాన్ని ప్ర‌పంచ బాధ‌ను చేసి జోలె ప‌ట్టారు.
మ‌న బాధ‌ను ప‌ట్టించుకోకుండా, మ‌న క‌ష్టాల్లో పాలుపంచుకోకుండా ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న వీరి ప‌త్రిక‌ల‌ను కొనాలా? ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలా? వాళ్ల వ్యాపార ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించాలా? మ‌న‌దీ ఒక బ‌తుకేనా?
మానవ‌త్వం అన్న‌ది ప్రాంతాన్ని బ‌ట్టి మారుతుందా? అంటే వీళ్ల దృష్టిలో తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నుషులు కాదా? వాళ్ల బాధ‌లు బాధ‌లు కావా? వాళ్ల క‌ష్టాలు క‌ష్టాలు కావా? వాళ్ల క‌న్నీళ్ల‌ను తుడిచే బాధ్య‌త వీరికి లేదా?
మీరే ఆలోచించండి... !!!

No comments:

Post a Comment