జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఏడాది పని చేయాలన్న నిబంధన తొలగించాలా?
మూడేళ్లు పనిచేయాలన్న నిబంధనను ప్రభుత్వం ఏడాదికి తగ్గించింది... అయినా పట్టువీడటం లేదా?
వీళ్లేం డాక్టర్లో ఏమో....!!!
-----------------------------
మూడేళ్లు పనిచేయాలన్న నిబంధనను ప్రభుత్వం ఏడాదికి తగ్గించింది... అయినా పట్టువీడటం లేదా?
వీళ్లేం డాక్టర్లో ఏమో....!!!
-----------------------------
నా మిత్రుడి అనుభవం చెబుతాను..
------------------
------------------
ఆయన డాక్టర్‌గా పనిచేస్తున్నాడు... నగరంలో ఆయనకు ఉద్యోగం వచ్చింది.. గ్రామీణ ప్రాంతల్లో మూడేళ్లు పనిచేస్తే 30 శాతం కోటా ఉంటుందట... అదే నగరాల్లో ఆరేళ్లు పనిచేస్తే ఆ కోటా లభిస్తుందట... పాపం మా మిత్రుడికి నగరంలో పోస్టింగ్ వచ్చింది... ఆరేళ్లపాటు పనిచేస్తేనే 30 శాతం పీజీ కోటాలో సీటు పొందొచ్చు.. అయితే నగరంలో ఓ 15 రోజులు పనిచేశాడో లేదో ఇయనను ఇక గ్రామీణ ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై పంపారట... దాదాపు 14 నెలలుగా గ్రామాల్లోనే ఆయన డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నాడు.. ఎందుకిలా డిప్యుటేషన్లపై పంపుతున్నారని ఆరా తీస్తే ఆసక్తికర విషయం వెల్లడైందట.... గ్రామాల్లో పోస్టింగ్‌లు తీసుకుంటున్న వారు లంచాలు ఇచ్చి డిప్యుటేషన్లపై నగరాలకు వస్తున్నారట... అంటే వాళ్లు నగరాల్లో ఉంటూ గ్రామీణ కోటా కింద పీజీ సీట్లు కొట్టేసేందుకు ఈ ఎత్తుగడలు చేస్తున్నారు.. ఇక పట్టణాలు, నగరాల్లో పనిచేసే వాళ్లు డిప్యుటేషన్ల పేరిట గ్రామాలకు వెళ్తున్నారు... కనీసం నేను గ్రామంలోనే పనిచేస్తాను... అక్కడే పోస్టింగ్ ఇవ్వండని అడిగినా ఇవ్వడం లేదట...
-------------------------------------
ఏమో అనుకున్నా కానీ.... రాజకీయాలు చేయడంలో కొందరు డాక్టర్లు కూడా ఎవరికీ తీసుపోయేలా లేరు... లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వీళ్లకు అభ్యంతరం ఏంటి? కొంతకాలం పనిచేస్తే ఏమైనా కొంపలు మునుగుతాయా?
No comments:
Post a Comment