1

1

Friday, 31 October 2014

మీడియా సంస్థ‌ల్లో కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌...

మీడియా సంస్థ‌ల్లో కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌...
20-50 వేల మ‌ధ్య‌న వ‌చ్చే వారి జీతం 20 వేలు మాత్ర‌మే..
ఇక 50-ల‌క్ష రూపాయాలు వ‌చ్చే వారికి రూ.30 వేలు మాత్ర‌మే చెల్లింపు...

ఉద్యోగుల జీతాల్లో ఇష్టారీతిన కోత‌లు...

అది పేరు మోసిన ఛానెల్‌.. ఆ ఛానెల్ కోసం ఉద్యోగులు ఏళ్ల త‌ర‌బ‌డి త‌మ జీవితాల‌ను ధార‌పోశారు.. కొంద‌రైతే పోలీసు కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా ఆ సంస్థ కోసం కొట్లాడారు.. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా ఆ సంస్థ వారికి ఇస్తున్న న‌జ‌రానా ఏంటో తెలుసా... ?  జీతాల్లో కోత‌... అవును.. న‌వంబ‌రు 1 నుంచి వారికి అందే జీతాల్లో కోత విధిస్తోంది.. ఉద్యోగి జీతం 20 వేల నుంచి 50 వేల వ‌ర‌కు ఉంటే వారంద‌రికీ 20 వేల‌ను మాత్ర‌మే చెల్లిస్తున్నారు.. అంటే 50 వేలు వ‌చ్చే వాడికి ఇప్పుడు 20 వేలే వ‌స్తాయి..  ఇక 50వేల నుంచి ల‌క్ష వ‌ర‌కు జీతం ఉన్న వారికి 30 వేలే ఇస్తున్నారు.. అంటే ల‌క్ష వ‌చ్చే వాడికి ఇక‌పై 30 వేలే వ‌స్తుంద‌న్న మాట‌.... మొన్న ప‌చ్చ ప‌త్రిక‌ల్లో ఇష్టారీతిన ఉద్యోగుల‌ను తొల‌గించారు.. ఇప్పుడు ఇష్టారీతిన జీతాల్లో కోత‌లు పెడుతున్నారు... అవ‌స‌రంఉన్న‌న్ని రోజులు వాడుకొని ఆ త‌ర్వాత ఉద్యోగుల‌ను క‌రివేపాకుల్లాగా తీసేస్తున్నారు..

ఇదే ప‌నిని ఏదైనా ప్రైవేటు సంస్థ చేస్తే మీడియా వాళ్లు దాన్ని త‌ప్పుగా చూపేవారు.. మ‌రి ఇప్పుడు మీడియా యాజ‌మాన్య‌మే త‌ప్పు చేస్తోంది... మ‌రి మీడియా యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించేది ఎవ‌రు?

అస‌లు కార్మిక చ‌ట్టాల‌ను బ‌ల‌హీనం చేస్తున్న‌ది ఎవ‌రు?   క‌నీసం  కార్మికులైనా అన్యాయంపై గొంతెత్తుతారు... కానీ జ‌ర్న‌లిస్టుల‌కు ఆ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది... వీళ్ల జీవితాలు వెట్టి చాకిరిగా మారిపోయాయి.... ఈ ప‌ద్ధ‌తి మార‌కుంటే అన్ని ప్రైవేటు సంస్థ‌లు, మీడియా యాజ‌మాన్యాలు ఇలాగే చేస్తాయి... మీడియా ముసుగులో కోట్లు సంపాదించిన వారి ఆస్తుల‌ను అమ్మి జీతాల‌ను చెల్లించ‌డానికి చేతులు ఎందుకు రావ‌డం లేదు...?

నోట్‌:  జీతాల్లో కోత విష‌యంలో తెలంగాణ‌, ఆంధ్రా జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల స‌మ‌న్యాయం పాటించిన‌ట్లు తెలిసింది...

No comments:

Post a Comment