1

1

Tuesday, 14 October 2014

ప‌త్రికా యాజ‌మాన్యాల‌కు, సినీ న‌టుల‌కు ఓ చిన్న‌ విజ్ఞ‌ప్తి...

ఈనాడు విరాళాల సేక‌ర‌ణ మొద‌ల‌య్యేది ఎప్పుడు.. రాధాకృష్ణ గారు ఇప్పుడు రెండు జోలెలు పట్టాలేమో..(ఒక‌టి రాజ‌ధాని కోసం, ఇంకోటి తుపాన్ కోసం)
ఇక సినీ న‌టుల ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లు.. ఇంకా ఎన్నెన్నో మ‌నం చూస్తామేమో.... నిజ‌మే తుపాన్లు వ‌చ్చినా విప‌త్తులు వ‌చ్చినా మ‌నం ఆప‌న్న హ‌స్తం అందించాలి...
కానీ తెలంగాణ‌లో క‌ర‌వు వ‌స్తే ఏ ఒక్క చారిటీ మ్యాచ్ అయినా జ‌రిగిందా? ఏ ఒక్క ప‌త్రికైనా విరాళాలు సేక‌రించిందా?
వ‌ర‌ద‌లు, తుపాన్లు విప‌త్తులే... అలాగే క‌ర‌వు కూడా విప‌త్తే... మా తెలంగాణ‌కు తుపాన్లు రాక‌పోయినా క‌ర‌వు మాత్రం అప్పుడొప్పుడు ప‌ల‌క‌రిస్తుంది.. క‌ర‌వు స‌మ‌యంలోనూ మా కోసం ఈ సినిమా వాళ్లు, ప‌త్రికల వాళ్లు ముందుకొస్తే బాగుంటుంది..
ప్ర‌త్యేక క‌థ‌నాలు, ప్ర‌త్యేక సంచిక‌లు వేసి మన గోస‌ను కేంద్రం వ‌ర‌కూ తీసుకెళితే బాగుంటుంది...
అంద‌రి గోస ఒక‌టే అయిన‌ప్పుడు ఓ ప్రాంతం గోస క‌నిపించి.. మ‌రో ప్రాంతం గోస క‌నిపించ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాదు..
తుపాన్ వ‌స్తే న‌ష్ట‌ప‌రిహారం ఇంత ఇవ్వాలి.. అంత ఇవ్వాలి.. ఇది చేయాలి.. అది చేయాలంటూ రాస్తారు.. ప్ర‌జ‌లు ఇలా ఉండాలి అలా ఉండాల‌ని చెబుతారు..
మ‌రి క‌ర‌వుతో రైతులు ఊళ్లు వ‌దిలి వెళుతుంటే.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే వాళ్ల చావుల సంఖ్య‌ను లెక్కిస్తారు.. అంతే త‌ప్ప వారిని ఎలా ఆదుకోవాల‌ని ప‌ట్టించుకోరు ఎందుకు?
పంట విరామాన్ని జాతీయ స‌మ‌స్య చేస్తారు.. కానీ తెలంగాణ‌లో ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న పంట విరామాన్ని ప‌ట్టించుకోరు ఎందుకు?
ఏది ఏమైనా జ‌మ్మూకాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వర‌కు ఎవ‌రికి బాధ క‌లిగిన మ‌న‌కు క‌లిగిన‌ట్లు భావిస్తేనే మ‌నలో భార‌తీయుల‌మ‌న్న ర‌క్తం ప్ర‌వ‌హిస్తున్న‌ట్లు.. !!
గ‌తం గ‌త‌హః అనుకుంటాం.... ఇక నుంచైనా మారుతార‌ని ఆశిస్తున్నాం..

No comments:

Post a Comment