మోడీ గారికి విజ్ఞప్తి...
--------------------
పీవీ గారి జయంతిని జాతీయ సంస్కరణల దినోత్సవంగా జరపండి..
--------------------------
కాంగ్రెస్‌లో మరుగున పడేయబడిన గొప్ప ప్రధానుల్లో పీవీ నరసింహారావు ఒకరు... లాల్ బహదూర్ శాస్త్రి మరొకరు... గత ఎన్నికల్లోనూ మీరు పీవీ నరసింహారావుకు జరిగిన అన్యాయంపై, తెలుగు వాళ్లకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు.. తొక్కి పెట్టేయబడిన మహనీయులకు ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రాధాన్యం బాగుంది.. మొన్న మహాత్మాగాంధీ గారి జయంతిని బాగా జరిపించారు.. నేడు సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా పాటించేలా చేశారు... ఇద్దరూ గుజరాత్ నేతలే కాబట్టి వాళ్లిద్దరికే ప్రాధాన్యం ఇచ్చారేమో అన్న అనుమానాలను నివృత్తి చేసేలా వచ్చే ఏడాది నుంచి పీవీ నరసింహారావు జయంతిని జాతీయ సంస్కరణల దినంగానో ఇంకేదైనా మంచి పేరుతోనో జరపండి..సంక్షోభ సమయంలో దేశాన్ని కాపాడిన యుగ పురుషుడు పీవీ నరసింహారావు... ఆయనకు జరిగిన అవమానాన్ని సరిదిద్దండి.. సముచిత ప్రాధాన్యం ఇవ్వండి.. ఈ ఏడాది పీవీ నరసింహారావు జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరిపింది.. బహుషా ఆ సమయంలో మీరూ పీవీ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించాలని ఆలోచించి ఉండకపోవచ్చు... కానీ వచ్చే ఏడాదైనా మా పీవీని గౌరవించండి సార్... అలా కాకుండా 2019 వరకు ఆగుదాం అంటే తప్పుడు సంకేతాలు వెళతాయి...
-------------------------
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అక్టోబరు 2నే ఉంది.. పాపం అందుకే ఆయనకు తగిన గుర్తింపు రావడం లేదు... జై జవాన్, జై కిసాన్ పిలుపునిచ్చి దేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి.. మరి ఆయన జయంతికీ ప్రాధాన్యతల లభించే కార్యక్రమానికి రూపకల్పన చేయండి...

No comments:
Post a Comment