1

1

Saturday, 11 October 2014

విద్యుత్ పొదుపు చ‌ర్య‌లే వెలుగు బాట‌లు... ఇది ముమ్మాటికీ నిజ‌మే...

విద్యుత్ పొదుపు చ‌ర్య‌లే వెలుగు బాట‌లు...
ఇది ముమ్మాటికీ నిజ‌మే...

ఇది ఈనాడు ప‌త్రిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎడిష‌న్ ఎడిటోరియ‌ల్ పేజీలో ప్ర‌ధాన వ్యాసం.. ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు మంచి ప్ర‌య‌త్నం చేసింది... మంచి కార్టూన్ వేయించింది... అందులో విద్యుత్ పొదుపు ఎలా చేయాలి... క‌రెంట్ బిల్లులు స‌కాలంలో ఎలా క‌ట్టాల‌ని అన్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పింది..

గుజ‌రాత్‌లో మోడీ అధికారంలోకి వ‌చ్చాక చాలా ఏళ్ల వ‌ర‌కు విద్యుత్ సంక్షోభం ఉంద‌ని.. కానీ ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల ఇప్పుడు ఆ రాష్ట్ర‌ప‌రిస్థితి మెరుగైంద‌ని... నాయ‌కుడు ఎంత స‌మ‌ర్థుడైనా రాత్రికి రాత్రి అన్ని జ‌రిగిపోవ‌ని వ్యాస‌క‌ర్త అభిప్రాయ‌ప‌డ్డారు...



రైతులు, వినియోగ‌దారులు విద్యుత్ పొదుపు చ‌ర్య‌లు పాటించేందుకు ప‌లు నిబంధ‌న‌లు పెట్టాల‌ని... వాటిని ఉల్లంఘిస్తే జ‌రిమానాలు విధించ‌డాలు చేయాల‌ని సూచించారు..

ఇక రైతులు నాణ్య‌మైన పంపుసెట్లు వాడితే నిరంత‌ర విద్యుత్ ఇస్తామ‌న్న నిబంధ‌న‌లు పెట్టాల‌న్నారు..

అస‌లు తెలంగాణ విద్యుత్ స‌మ‌స్య‌తో కొట్టుమిట్టాడుతోంది క‌దా..
ఇక్క‌డ ఇలాంటి వ్యాసం రాయొచ్చు క‌దా....

ఇలా రాస్తే టీడీపీ, కాంగ్రెస్‌ల బ‌స్సు యాత్ర‌లు తుస్సుమంటాయ‌ని భ‌య‌మా?

No comments:

Post a Comment