అది ఓ వర్గానికి కొమ్ముకాసే ప్రధాన పత్రిక...
దాని తెలంగాణ బ్యూరో చీఫ్ మనోడు కాదు ..
ఇంకేముంది మన ప్రయోజనాలకు సంబంధించిన వార్తలు వస్తాయా? మనం చచ్చినా రావు..
ఇక్కడ ఉంటూ అడుగడుగునా ఇక్కడి ప్రజలకు, రైతులకు వెన్నుపోటు పొడిచే రాతలు...
మొన్న సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్న సమయంలో కృష్ణా డెల్టాలో సాగు కష్టాలు, తాగు కష్టాలు అంటూ వార్తలు రాశాడు..
అంతే పచ్చ పార్టీ రంగంలోకి దిగింది... గగ్గోలు పెట్టింది... కృష్ణాబోర్డు మీటింగ్ పెట్టించింది... ఫలితంగా డెడ్ స్టోరేజీ ఉన్నా 10 టీఎంసీలు తరలించుకున్నారు...
ఇక నిన్నటికి నిన్న శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా.. అడుగంటిన శ్రీశైలం అంటూ కుట్ర కథనం రాశాడు..
అంతే ఇక పచ్చ పార్టీ డ్రామాలు మొదలయ్యాయి... వరసగా కుట్ర కథనాలు రాయడం.. ఆ వెంటనే మళ్లా కృష్ణా బోర్డు సమావేశం జరగడం వెంటవెంటనే జరిగిపోయాయి...
ఇప్పుడు ఇక తెలంగాణ రైతులకు విద్యుత్ అందకుండా నీటి విడుదలను ఆపించేలా ఆదేశాలు ఇప్పించుకోవడం అయిపోయింది...
-------------------------
అసలు తెలంగాణ పత్రికల ఆవశ్యకత ఇక్కడే ఏర్పడుతుంది... మన రైతులకు విద్యుత్ కావాలన్న సమయంలో మన పత్రిక అయి ఉంటే శ్రీశైలంలో ఉత్పత్తి చేసుకోవచ్చు అని రాసేది... కానీ ఆ పత్రిక మనది కాదు.. రాసేవాడు మనవాడు కాదు.. వాళ్ల ప్రాంతం, వాళ్ల ప్రయోజనాలు ముఖ్యం...
కనీసం న్యాయాన్యాయాల విచక్షణ లేని రాతలివి...
ఇది మారాలి.... తెలంగాణలో మీడియా సంస్థలు మరిన్ని రావాలి...
ఆంధ్రా పత్రికల్లో బ్యూరో చీఫ్ లను మన వారినే ఉంచాలి..
నోట్: ఇక్కడ ఆ విలేకరి లక్ష్యం నెరవేరింది.. తన ప్రాంతం అవసరాలకు నీటిని కాపాడుకోవాలని చూశాడు... ఆంధ్రా సర్కారును అప్రమత్తం చేసే
వార్తను రాశాడు... ఆ వెంటనే లాబీయింగ్ మొదలైంది.. కృష్ణా బోర్డు నిర్ణయం వచ్చింది...
No comments:
Post a Comment