1

1

Thursday, 16 October 2014

తెలంగాణ మ‌ట్టిలో మాణిక్యం..శంక‌ర‌న్న‌


కార్టూన్ ప్ర‌పంచంలో ఆస్కార్ లాంటి పుర‌స్కారం మ‌న శంక‌ర‌న్న‌ను వ‌రించింది...
64 దేశాల కార్టూనిస్టుల్లో మేటి మ‌న తెలంగాణ వాసి కావ‌డం గ‌ర్వ‌కార‌ణం.
ఇలాంటి కార్టూనిస్టుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రింత ప్రోత్సాహం ఇవ్వాలి..
అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలంగాణ కీర్తి ప‌తాకను రెప‌రెప‌లాడించిన శంక‌ర‌న్న‌కు అభినంద‌న‌లు...
----------------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పటి నుంచి క‌ళారంగంలో అన్నీ శుభ‌ప‌రిణామ‌లే ఎదుర‌వుతున్నాయి... ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం దాశ‌ర‌థి, కాళోజీ వంటి తెలంగాణ క‌ళారంగానికి వెన్నెముఖ‌లైన వారి జ‌న్న‌దినాల‌ను అధికారికంగా నిర్వ‌హించింది.. మ‌రోవైపు ఇంజినీర్ న‌వాజ్ జంగ్ జ‌న్మ దినాన్ని ఇంజినీరింగ్ దినోత్స‌వంగా జ‌రిపింది... అలాగే మెట్రో పాలిట‌న్ స‌ద‌స్సు సంద‌ర్భంగా న‌గ‌రానికి వ‌చ్చిన మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం మ‌న తెలంగాణ ఆర్టిస్టు గుండా ఆంజ‌నేయులు పెయింటింగ్‌ను ఆకాశానికి ఎత్తాడు... త‌న ప్ర‌సంగంలో ప్ర‌పంచానికి చాటాడు..
తాజాగా మ‌న తెలంగాణలో విప్ల‌వాల గ‌డ్డ అయిన న‌ల్ల‌గొండ జిల్లా ముద్దుబిడ్డ, కార్టూనిస్టు శంక‌ర‌న్న కెరీర్‌లో మ‌రోదైన అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇది ఒక‌విధంగా ఆయ‌న‌కే కాదు తెలంగాణ మ‌ట్టికి, భార‌త కార్టూనిస్టుల‌కు ప్ర‌పంచంలో అరుదైన గౌర‌వంగా భావించొచ్చు.. ఈ గ్రాండ్ ప్రి అవార్డు ఆసియా ఖండానికి ద‌క్క‌డం ఇదే తొలిసారి కావ‌డం మ‌రో విశేషం... ఈ అవార్డును ఆయ‌న పొంద‌డం ద్వారా తెలంగాణ పేరు మ‌రోమారు అంత‌ర్జాతీయంగా మారుమోగిన‌ట్లైంది.. శంక‌ర‌న్న ఇంకా మ‌రెన్నో కీర్తి ప్ర‌తిష్ట‌లు సాధించాల‌ని, తెలంగాణ పేరును నిల‌బెట్టాల‌ని తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కోరుకుంటున్నా... క‌ళారంగంలోని పెద్ద‌లు, ప్ర‌తినిధులు ఈ ఖ్యాతిని మ‌రింత విస్తృతం చేసేందుకు ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి శంక‌ర‌న్న‌కు మ‌రింత ప్రోత్సాహాన్ని క‌ల్పించాల‌ని కోరుతూ...
తెలంగాణ అసాంజే...

No comments:

Post a Comment