1

1

Monday, 20 October 2014

తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌కు సూచ‌న‌లిచ్చే మీ విజ్ఙానం... పోల‌వ‌రం విష‌యంలో వీరికి ఎందుకు ప‌నికి వ‌స్త‌లేదు?.

ప్ర‌ముఖ ఇంజినీర్ హ‌నుమంత‌రావు గారికి కృత‌జ్ఙ‌త‌లు. మంచో చెడో... తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌పై మీ అభిప్రాయాన్ని చెప్పారు. దానిని మేం సానుకూలంగా చూస్తాం. మీరు నిపుణులు కాబ‌ట్టి మీ కోణంలో ఏదైనా మంచి ఉందా అని ఆలోచిస్తాం. కానీ సీమాంధ్రోళ్ల లెక్క పోల‌వ‌రం డిజైన్ మార్చాల‌నే మీ ప్ర‌తిపాద‌న‌ను బుట్ట దాఖ‌లు చేసిన‌ట్లు... అప్ప‌టిదాకా మిమ్మ‌ల్ని ఆకాశానికి ఎత్తి, ఆ ప్ర‌తిపాద‌న చేయ‌గానే మిమ్మ‌ల్ని ప్ర‌చారానికి దూరం చేసిన సీమాంధ్ర మీడియా లెక్క మేం విస్మ‌రించం. కాక‌పో్తే మా బాధ‌ల్ల‌... పోల‌వ‌రంపై మీరు గొంతెత్తి అరిచినా ప‌ట్టించుకోని ఈ సీమాంధ్ర మీడియా తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌పై మీరిచ్చే సూచ‌న‌ల‌ను (ముందు ఆంధ్ర‌జ్యోతి, ఇప్పుడు సాక్షి, రేపు ఈనాడు?) ప‌తాక శీర్షిక‌లో ఇస్తుంది. కానీ పోల‌వ‌రం ఇప్ప‌టికీ బ‌ర్నింగ్ ఇష్యూగా ఉన్నా ఎందుకు మీ ప్ర‌తిపాద‌న‌ను ఒక్క‌సారైనా తెర‌పైకి తేవ‌డం లేదు?. సాధ్యాసాధ్యాల‌పై టీవీల్లో ఎందుకు చ‌ర్చ‌లు పెట్ట‌డం లేదు?. క‌నీసం పోల‌వ‌రం అంశం వ‌చ్చిన‌పుడు మిమ్మ‌ల్ని ఈ మీడియా ఎందుకు విస్మ‌రిస్తుంది?. తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌కు సూచ‌న‌లిచ్చే మీ విజ్ఙానం... పోల‌వ‌రం విష‌యంలో వీరికి ఎందుకు ప‌నికి వ‌స్త‌లేదు?. ఇదే మా బాధ‌.
---
ఇక్క‌డ తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌లో వ్య‌యం ప్ర‌ధానం కాదు. శాశ్వ‌త నీటి ల‌భ్య‌త ముఖ్యం. అందుకే కృష్ణా, గోదావ‌రి నీటిని మ‌ళ్లించ‌డ‌మే శ‌ర‌ణ్యం. పైగా అస‌లు తెలంగాణ వాటాను స‌క్ర‌మంగా వాడుకునే భాగ్య‌మే క‌ల‌గ‌డం లేదు. ఈరూపంలోనైనా కొంత వాడుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా తెలంగాణ‌లోని న‌ల్లొండ లాంటి జిల్లాల భూగ‌ర్భ‌జ‌లాలు చాలాచోట్ల విష‌తుల్యంగా... ఫ్లోరైడ్ భూతంలో చిక్కుకున్నాయి. అందుకే భూగ‌ర్భ‌జ‌లాల కంటే న‌దుల నీరే శ్రేయ‌స్క‌రం అనేది ఇక్క‌డి నిపుణుల అభిప్రాయం.

No comments:

Post a Comment