హుదూద్ బాధితుల కోసం రూ.3 కోట్లతో సహాయ నిధి మొదలుపెట్టిన డ్రామోజీ... తన సంస్థలోని ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని దానికి ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సంస్థలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక.. అన్నట్లుగా తయారైంది. మా ప్రాంతంలో ఎన్ని బాధలొచ్చినా ఒక్కనాడు ఒక్క పైస కూడా ఇవ్వలేని తమను బలవంతంగా మరోసారి విరాళాల జాబితాలోకి గుంజుతున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మంచిదేగానీ... అది రెండువైపులా ఉంటే బాగుంటుందనేదే సగటు తెలంగాణవాది ఆవేదన.
Ready lo unnam....����
ReplyDelete