**** మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటుచేశారు. భారతీయుడైన గాంధీ విగ్రహం మనకెందుకు అని అమెరికన్‌లు కూడా భావిస్తే!
పలు దేశాల్లో ఉన్న తెలంగాణకు చెందినవారు బతుకమ్మ పండుగ జరుపుకొన్నారు. మా దేశంలో ఉంటూ మా పండుగను కాకుండా మీ పండుగలు జరుపుకోవడం ఏమిటని ఆయా దేశస్థులు ఎవరూ ప్రశ్నించలేదే? ****
----------------
రాధాకృష్ణ గారూ... మరి ఒక భారతీయుడి విగ్రహం అమెరికాలో ఉంటుంది కానీ.. సాటి తెలంగాణ యోధుల విగ్రహాలు ఆంధ్రాలో ఉండవెందుకండీ... ?
ఇక ప్రపంచంలోని పలు దేశాల్లో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకుంటారు... కానీ ఆంధ్రాలో జరుపుకోరు ఎందుకో... ?
ప్రపంచంలో ఉన్న మహనీయుల విగ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించుకునేంత విశాల హృదయం మాకుందండీ... మరి మా విగ్రహాలను ఇన్నేళ్ల పాటు మీ ప్రాంతంలో ప్రతిష్టించుకోకపోవడానికి కారణాలేంటండీ.... !!!
మా దగ్గర దాండియా ఆడుతారు.. ఓనమ్ జరుపుకుంటారు.. ఇంకా అనేక పండుగలు చేసుకుంటారు.. ఇవన్నీ మీకు కనిపించవు.. ఎందుకంటే మీది హస్వదృష్టి కదా... కాదు కాదు బాబు దృష్టియేమో.... !!!
మా దగ్గర దాండియా ఆడుతారు.. ఓనమ్ జరుపుకుంటారు.. ఇంకా అనేక పండుగలు చేసుకుంటారు.. ఇవన్నీ మీకు కనిపించవు.. ఎందుకంటే మీది హస్వదృష్టి కదా... కాదు కాదు బాబు దృష్టియేమో.... !!!
తెలంగాణ వస్తేనే బతుకమ్మ ఎత్తుకుంటారు బాబు...
తెలంగాణ వస్తేనే కొమురం భీం గుర్తొస్తాడు మీకు...
తెలంగాణ వస్తేనే ఇంకా అనేకం గుర్తొస్తాయి...
అంతకు ముందు వీటిని గుర్తించలేదు ఎందుకు?
తెలంగాణ వస్తేనే కొమురం భీం గుర్తొస్తాడు మీకు...
తెలంగాణ వస్తేనే ఇంకా అనేకం గుర్తొస్తాయి...
అంతకు ముందు వీటిని గుర్తించలేదు ఎందుకు?
Note: పై ప్రశ్నలన్నింటికీ మీ ఆర్కే మార్కు విశ్లేషణ ఇవ్వండి...
No comments:
Post a Comment