1

1

Saturday, 11 October 2014

మోడీ గారికి ఈనాడు హిత‌బోధ‌... స‌మైక్య స్ఫూర్తిని నిల‌బెట్టాల‌ని సూచ‌న‌...


మోడీ గారికి ఈనాడు హిత‌బోధ‌...
స‌మైక్య స్ఫూర్తిని నిల‌బెట్టాల‌ని సూచ‌న‌...
అప‌రిప‌క్వ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని వ్యాఖ్య‌..
కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ పాల‌న ఉండాల‌న్న ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన ఈనాడు సంపాద‌కీయం.....
కేంద్ర‌, రాష్ట్రాల్లో ఒకే పార్టీ పాల‌న ఉండాల‌న్న మోడీ గారి వాద‌న‌పై ఈనాడులో కొంత ఘాటైన సంపాద‌కీయ‌మే వెలువ‌డింది...
ఇది స‌మాఖ్య స్ఫూర్తికి భంగం క‌లిగే ధోర‌ణి అని.. గ‌తంలో ఇందిరా గాంధీ ఇలాంటి వాద‌న‌నే తెచ్చింద‌ని గుర్తుచేసింది...
ప్ర‌ధానిగా అన్ని రాష్ట్రాల‌ను క‌లుపుకొని పోవాలి కానీ...ఇలా అప‌రిప‌క్వ మాట‌లు మాట్లాడ‌టం స‌రికాద‌ని హిత‌వు ప‌లికింది...
బ‌హుషా కేంద్ర‌, రాష్ట్రాల్లో ఏక పార్టీ పాల‌న అంటే కాంగ్రెస్‌, బీజేపీలే జాతీయ పార్టీలు వాటికి త‌ప్ప మిగిలిన వారికి ఆస్కారం లేదు.. ఈ నేప‌థ్యంలో పాపం బాబుగారికి ముప్పు తెస్తాయ‌ని గ్ర‌హించి ముందే అప్ర‌మ‌త్త‌మై ఇలా రాసిందో.. లేక శివ‌సేన మాదిరిగా టీడీపీతోనూ తెగ‌తెంపులు చేసుకొని స్వ‌తంత్రంగా ఎదుగుతుంద‌ని అనుమానించి రాసిందో కానీ... ఒక మంచి సంపాద‌కీయ‌మే వ‌చ్చింది...
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అభివృద్ధికి ఢోకా ఉండ‌దు... స‌మ‌ర్థ‌నాయ‌కుడు ఉంటే అభివృద్ధి సాధ్య‌మే...
నోట్‌: ఎన్నిక‌ల ముందు కేంద్రంలో మేం వ‌స్తే.. మా మిత్ర‌ప‌క్షాన్ని గెలిపించ‌క‌పోతే న‌ష్టం క‌లుగుతుంద‌న్న రీతిలో సీమాంధ్ర‌, తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిన‌ప్పుడు ఇలాంటి వ్యాసాలు రాక‌పోవ‌డం శోచ‌ణీయం.... ఇప్పుడు కూడా తెలంగాణ‌కు రావాల్సిన 10వేల కోట్లు కేంద్రం నుంచి విడుద‌ల కాక‌పోవ‌డంపైన కూడా ఇలాంటి వ్యాసాలు రావాలి...

No comments:

Post a Comment