పాపం ఆంధ్రజ్యోతి వాడు సంకెళ్లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నిస్తుంటే... కొందరు మిత్రులు పదేపదే ప్రశ్నించడంతో గత్యంతరం లేక సిగ్గుతో ఒకటి అర సంకెళ్లు వేస్తూ నెట్టుకొస్తున్నాడు...
ఈరోజు మెట్రో హరీశ్‌రావు, కేటీఆర్ వార్తలు రెండింటికి మాత్రం సంకెళ్ల లోగో వేశాడు.. మళ్లా హరీశ్‌రావు, ఇతర మంత్రులది ఇంకొన్నివార్తలు ఉన్నా అక్కడ సంకెళ్లు కనిపించలేదు...
ఇక మెట్రో పొలిస్ సదస్సులో మీడియాను అనుమతించకపోవడంపై మీడియా యావత్తు గగ్గోలుపెట్టి తగిన ప్రచారం ఇవ్వలేదు...వాస్తవానికి మీడియాను దూరం పెట్టిన ఈ కార్యక్రమానికి ప్రచారం ఇవ్వొద్దు... ఇది మీడియా స్వేచ్ఛ భంగం కలిగించిన అంశం... దీనిపై వ్యతిరేకంగా రాయాలి... కానీ విచిత్రంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు మెట్రో పొలిస్ సదస్సుపై 8 పేజీల ప్రత్యేక సంచికను తెచ్చింది.. అయితే అదంతా ప్రకటనల కోసం తెచ్చిన సంచికలాగే ఉంది... బహుషా ఆ వార్తల కూడా సంకెళ్లు వేస్తే ప్రకటనలు ఇచ్చిన వాళ్లు డబ్బులు ఇవ్వరనుకొని సంకెళ్లను స్వచ్ఛందంగా తెంచుకున్నట్లు కనిపిస్తోంది...
మేం తలచుకుంటే ప్రభుత్వాలు కూలుతాయన్న అహంతో రెచ్చిపోయిన కొన్ని మీడియా సంస్థలకు ఇదో గుణపాఠమే..
No comments:
Post a Comment