1

1

Saturday, 11 October 2014

దేశంలో ఒక వ్య‌క్తి ఒక పార్టీలో చేరితే జీవితాంతం అదే పార్టీలో ఉండేలా చ‌ట్టం చేయాలి

టీఆర్ఎస్‌లోకి ఇత‌ర పార్టీల నేత‌లు వెళితే అది త‌ప్పు..
టీడీపీలోకి ఇత‌ర పార్టీల నేత‌లు వ‌స్తే అది ఒప్పు...
నిన్న కొంద‌రు నేత‌లు టీడీపీలో చేరారు..
ఈ రోజు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిందీ వార్త‌...
డ‌బ్బుల‌తో వారిని కొనుక్కున్నారా?
నా భావ‌న‌....
ఏది ఏమైనా ఇలాంటి చేరిక‌ల‌పై నిషేధం విధించేలా చ‌ట్టం చేయండి... రాజ‌కీయ విభీష‌ణుల‌కు క‌ళ్లెం వేయండి...ఇందులో నేను కొన్ని సూచ‌న‌లు ఇస్తాను.. పాటిస్తామ‌ని ఎవ‌రైనా ముందుకొస్తారా? మీరే చూడండి...

దేశంలో ఒక వ్య‌క్తి ఒక పార్టీలో చేరితే జీవితాంతం అదే పార్టీలో ఉండేలా చ‌ట్టం చేయాలి... లేదా ఒక‌వేళ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళితే.. దాదాపు ఐదేళ్ల పాటు ఇంకో పార్టీలో చేర‌కుండా ఆంక్షలు ఉండాలి... అదే స‌మ‌యంలో సొంత పార్టీ పెట్టుకునేందుకు అనుమ‌తి ఉండాలి.... గ‌తంలో పార్టీలు మారి నేరాలు చేసిన వారిని శిక్షించేందుకు ప్ర‌త్యేక కోర్టూ ఉండాలి....
ఇలాంటి నిబంధ‌న‌ల‌కు అన్ని రాజ‌కీయ పార్టీలు సిద్ధ‌మా?
నాకు తెలిసి మొద‌ట చంద్ర‌బాబే ముద్దాయిగా తేలుతాడేమో... కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయింది ఆయ‌నే క‌దా...!!!

No comments:

Post a Comment