1

1

Monday, 13 October 2014

చంద్ర‌బాబు మీడియా డ్రామాలు...

ఉన్న‌ది లేన‌ట్లు... లేనిది ఉన్న‌ట్లు చేయ‌డం, దాన్ని బాబుగారి ఘ‌న‌త‌గా చూప‌డం ప‌చ్చ‌పార్టీ, ప‌చ్చ ప‌త్రిక‌ల‌కు అల‌వాటే. ఆ కోవ‌లోదే ఓ సంఘ‌ట‌న‌. నిన్న (ఆదివారం) చంద్ర‌బాబు ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌ల ప్రెస్‌మీట్ పెట్టిండు. హుదూద్ తుఫాను వివ‌రాలు చెప్పాల‌నేది ఆయ‌న అభిలాష‌. బాగానే ఉంది. కానీ ప్రెస్‌మీట్‌కు ముందుగానే ఓ డ్రామా ఆడారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి లైన్ క‌లిపి మాట్లాడాల‌ని అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఎలాగూ వెంట‌నే ఇవ్వ‌రు క‌నుక ఆలోగా జ‌ర్న‌లిస్టులు వ‌చ్చారు. ఇక బాబుగారి సోది ఎలాగూ క‌నీసంగా 50 నిమిషాలు ఉంటుంది. అందుకే ఈలోగా పీఎం ఆఫీసు నుంచి లైను క‌లుస్తుంద‌ని ప‌క్కా స్కెచ్ ఏసిండ్రు. అనుకున్న‌ట్లుగ‌నే బాబు ప్రెస్‌మీట్ మ‌ధ్య‌లో పీఎం ఆఫీసు నుంచి లైన్ క‌లిసింది. ఇంకేముంది... మోడీ, బాబు జేబుల్లో ఉన్న‌ట్లుగ భ్ర‌మ‌లు క‌ల్పించేందుకు జ‌ర్న‌లిస్టుల ముందే చంద్ర‌బాబు-మోడీ మాట్లాడుకున్నారు. ఇంకేముంది ప‌చ్చ ప‌త్రిక‌లు అదో ఘ‌న‌త లెక్క హైలెట్ చేశాయి.
- అంతేనా... వాస్త‌వంగా చంద్ర‌బాబు తుఫాను ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నిన్న సాయంత్ర‌మే హెలిక్యాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరాలి. ప్రెస్ మీట్ అయిపో్ంగ‌నె నాలుగు గంట‌ల‌కు వెళ్లాల్సి ఉండ‌టంతో అధికారులు సిద్ధం చేసిండ్రు. కాన్వాయ్ కూడా క‌దిలింది అంత‌లోనే టైమ్స్‌నౌ వాళ్లు వ‌చ్చిండ్రు. ఇంకేముంది అధికారుల‌కు తెలియ‌కుండానే ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న చంద్ర‌బాబు వాళ్ల‌తో ఆత‌ర్వాత ఎన్డీటీవీతో మాట్లాడిండు. సాయంత్రం ఆరు గంట‌ల‌కు తీరిగ్గ పో్యిండు. నిజ‌మైన నాయ‌కుడైతే ప్ర‌చారం కోసం పాకులాడుత‌డా... బాధితుల‌ను ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఆరాట‌ప‌డ‌త‌డా... ప‌చ్చ డ్రామాలంటే గిట్ల‌నె ఉంట‌యి.

No comments:

Post a Comment