నిజంగా హుస్సేన్ సాగర్ శుద్ధి ఈ ఏడాది జరిగితే అది ముమ్మాటికీ ప్రభుత్వ విజయంగా నిలుస్తుంది. మరో వారం రోజుల్లో పనులు మొదలవుతాయని వార్తలు వస్తున్నాయి.. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా బేఖాతరు చేయకుండా ఈ లక్ష్యాన్ని సాకారం చేస్తే ముమ్మాటికీ అది జంట నగర ప్రజలకు మేలు చేకూరుస్తుంది. ఇదే స్ఫూర్తితో మూసీ నది ప్రక్షాళనకు నడుం కట్టడానికి ఊతమిస్తుందని నమ్ముతున్నాను. ఈ బృహత్ కార్యక్రమం చేపట్టిన సమయంలో కొంత అసౌకర్యం కలగడం సహజం.. ముఖ్యంగా దుర్గందం వ్యాపించవచ్చు.. ప్రజల ఆరోగ్యానికి నష్టం కలగని రీతిలో చర్యలు తీసుకొని ప్రక్షాళనను ప్రారంభించాలి.. వీలైనంత ఎక్కువ యంత్రాలను ఉపయోగిస్తే అంత త్వరగా పనిని పూర్తవుతుంది... ఒకవేళ నిర్దిష్ట గడువులోగా పని పూర్తి చేస్తే... ఏడాది కాలంలో టీఆర్ఎస్ సాధించిన విజయాల్లో హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకే మొదటి స్థానం దక్కడం ఖాయం.. అంతా సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నా..!!
No comments:
Post a Comment