సాగర్ నీళ్లను కిందకు వదిలితే 80 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతుందట...!!
కొందరి ఆందోళన..
---------------------
గంగానది ప్రక్షాళన పూర్తవుతుందన్న నమ్మకం ఉంది కానీ.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కష్టమే అనిపిస్తోంది.. మొన్నటి దాకా హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేయాలని కోర్టులను ఆశ్రయించారు కొందరు.. ఇప్పుడు అశాస్త్రీయంగా ప్రక్షాళన చేస్తున్నారంటూ కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు మరికొందరు.. ఈ లెక్కన మిషన్ కాకతీయ, మిషన్ మూసీ ప్రక్షాళనలు ఈ జన్మలో జరుగుతాయా?
ఎడ్డెం అంటే తెడ్డం తెడ్డం అంటే ఎడ్డెం అన్నట్లు ఉంది వీరి యవ్వారం..
ఆంధ్రజ్యోతిలో అయితే హుస్సేన్ సాగర్‌లో ఉన్న అర టీఎంసీ నీటిని కిందకు వదిలితే 80 లక్షల ఎకరాల సాగు భూమిపై ప్రభావం పడుతుందట... నిజంగా హుస్సేన్ సాగర్ నీళ్లతో అంత ప్రభావం ఉంటుందా? ఈ లెక్కన హుస్సేన్ సాగర్ పక్కన బోర్లు వేసుకున్న వాళ్లు ఎప్పుడో పైకి పోవాలి కదా...? ఇక మూసీ నది జోలికి కూడా మనం వెళ్లొద్దు అన్న మాటే కదా...!! చేతులు కట్టుకు కూర్చోవాల్సిందేనా..?
కనీసం ఈ పత్రికలైనా ప్రక్షాళన ఇలా చేయాలి అలా చేయాలని రాయొచ్చు కదా... రాయవు... స్వచ్ఛ భారత్ కావాలంటూ భారీ స్టేట్‌మెంట్లు ఇస్తాయి.. మరోవైపు ప్రక్షాళన పర్వాన్ని అడ్డుకునేలా కొందరి ప్రకటనలకు భారీ ప్రాధాన్యం ఇస్తాయి... జీవితాంతం హుస్సేన్‌సాగర్ కాలుష్యకాసారంగా ఉన్నా భరిస్తారు కానీ.. పూర్తి ప్రక్షాళన చేస్తామంటే అందులో రియల్ ఎస్టేట్ కోణాలు వెతుకుతారు... ఎలాగూ ప్రక్షాళన వద్దంటున్నారు కాబట్టి గణేశ్ నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్‌ను శాశ్వతంగా వాడుదామా? అని ప్రతిపాదిస్తే మళ్లా భగ్గుమంటారు.. సాగర్ ను నాశనం చేస్తారా అంటూ మండిపడతారు.. ఎందుకో?
bajana cheyataniki namasthe vundhi kada ....malla nuvvendhuku ee bajana chesthunnav ..prajala kosam raayandi
ReplyDelete